ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. సుమారుగా 585 కోట్లు పెట్టుబడి ఆ కంపెనీ రాష్ట్రంలో పెట్టనుంది. ఈ కంపెనీ వల్ల, సుమారుగా 6,600 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. 30 కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగస్తులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రేపు అమరావతికి కంపెనీ ప్రతినిధులు రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ తో భేటీ కానున్నారు. కంపెనీ ప్రతినిధులు సమావేశం అనంతరం, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖతో ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. అయితే, ఈ కంపెనీ పేరు మాత్రం ప్రభుత్వం బయట పెట్టటం లేదు. పక్క రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉండటంతో, ఒప్పందం జరిగే వరకు, పేరు బయటకు చెప్పం అంటుంది ప్రభుత్వం.

ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు.దేశంలో బెంగుళూరు,ముంబయి,ఢిల్లీ ఇలా అనేక నగరాలు,అమెరికా,దావోస్ దేశాల్లో పర్యటించి మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలను వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు.ఎలక్ట్రానిక్స్ పాలసీ,రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు.అందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ అయిన ఫాక్స్కాన్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది.రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదు.అలాంటిది ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 2 ఆంధ్రప్రదేశ్ లోనే తయారు అవుతున్నాయి.ఒక్క ఫాక్స్కాన్ కంపెనీలోనే సుమారుగా 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.దీనితో పాటు సెల్కాన్,కార్బన్,డిక్సన్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పూర్తి స్థాయి అభివృద్ధి,బ్యాటరీ తయారీ నుండి పూర్తి స్థాయి వస్తువు తయారీ వరకూ ఒకే చోట జరగాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఈఎంసి 1,2 మంచి ఫలితాలను ఇస్తున్నాయి.మొత్తంగా ఒక్క ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోనే ఇప్పటి వరకూ 18 వేల ఉద్యోగాలు వచ్చాయి.ఇటీవల కాలంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 15 వేల కోట్లు ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ అంగీకరించింది.తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏర్పాటు రిలయన్స్ ఏర్పాటు చేయనుంది.రోజుకి 10 లక్షల జియో ఫోన్లు,సెట్ టాప్ బాక్సులు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు రిలయన్స్ తయారు చేయనుంది.ఒకే చోట 25 వేల మందికి ఉద్యోగాలు రిలయన్స్
కల్పించబోతుంది.రిలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.

ఆరు నెలల క్రితం ముంబై పర్యటన లో భాగంగా రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ తో సుదీర్ఘంగా 2 గంటల పాటు మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు,రాయితీలు,పాలసీలు,క్లస్టర్ మోడల్ లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి మంత్రి నారా లోకేష్ చెప్పిన తరువాత అంబానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అయ్యారు.త్వరలోనే డిపిఆర్ పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది.ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చెయ్యడంలో మంత్రి నారా లోకేష్ మరో సారి సఫలీకృతుడు అయ్యారు.

దేశంలోని వివిధ నగరాల నుండి పోటీ ఉన్నా ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.బెంగుళూరు,తిరుపతిలో ఆ కంపెనీ ప్రతినిధులతో పలుమార్లు సమావేశం అయ్యి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితుల గురించి వివరించి.అనేక సార్లు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి వారిని ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు ఒప్పించారు.నిత్యం తన ఎలక్ట్రానిక్స్ టీం ని ఆ కంపెనీ ప్రతినిధులతో టచ్ లో ఉండేలా చెయ్యటం,వారికి అవసరం అయిన సమాచారాన్ని అత్యంత వేగంగా అందించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఉండే తేడా స్పష్టంగా అర్థం అయ్యేలా వివరించారు.ఈ కంపెనీ రాకతో ప్రపంచంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న మరిన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశలు ఉన్నాయి.దీనితో పాటు ఈ కంపెనీకి చెందిన సప్లైయర్ కంపెనీలు కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి

Advertisements

Advertisements

Latest Articles

Most Read