ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇప్పటికే సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తూ దేశంలోనే టాప్ లో ఉంది... కర్నూల్ లో పెడుతున్న అతి పెద్ద ప్లాంట్ తో, ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకుంది... ఇప్పుడో మరో మెగా సోలార్ ప్లాంట్ రాష్ట్రంలో రానుంది... చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న CETC రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ, 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ లో మెగా సోలార్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో, ఒప్పందం జరిగింది... చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలోని 18 ఎకరాలలో ఈ సోలార్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ రానుంది. సుమారుగా 1500 ఉద్యోగాలు రానున్నాయి...
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం పన్నుల రూపంలో $ 8 మిలియన్లను రాబట్టే అవకాసం ఉంది. ఢిల్లీ లో సిఐఐ సమ్మిట్ సన్నాహక కార్యక్రమంలో, దీని పై ఏంఓయు జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరపున, జాస్తి కృష్ణ కిషోర్, CETC డైరెక్టర్ మధ్య బుధవారం ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సమక్షంలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్, ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్‌వేర్ రంగంలో 20 శాతం మార్కెట్ షేర్ లక్ష్యం కలిగి ఉంది... 2020 నాటికి 50 శాతానికి మార్కెట్ వాటా చేరుకునే లక్ష్యంతో రాష్ట్రం ముందుకు వెళ్తుంది... అలాగే CETC కూడా చైనాలో అతి పెద్ద కంపెనీ.. బీజింగ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న CETC, ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీ.. 18 జాతీయ కీ లాబొరేటరీలు, 10 నేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లతో పాటు, 1,50,000 ఉద్యోగుల ఉద్యోగులు ఈ కంపెనీలో ఉన్నారు...