రేపు మన నవ్యాంధ్రకు, ఒక విశిష్ట అతిధి వస్తున్నారు... ప్రపంచంలోనే ఒక విప్లవం తీసుకువచ్చిన మైక్రోసాఫ్ అధినేత బిల్ గేట్స్ నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నం వస్తున్నారు... ఈ సారి బిల్ గేట్స్ వస్తుంది సాఫ్ట్ వేర్ విప్లవానికి కాదు, వ్యవసాయం గతి మార్చటానికి వస్తున్నారు... రైతులను సాంకేతికంగా ముందంజలో నిలిపి, వారి జీవితాల్లో మార్పు తేవాలన్న లక్ష్యంతో విశాఖ సాగర తీరంలోని ఏపీఐసీసీ మైదానంలో మూడు రోజులపాటు 'ఏపీ అగ్రిటెక్ సమ్మిట్- 2017' ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది..
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా నిన్న ఈ సమ్మిట్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), డాల్బెర్గ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ అగ్రి హ్యాకథాన్‌లో మైక్రోసాఫ్ అధినేత బిల్ గేట్స్ నవంబర్ 17న పాల్గుంటారు... వ్యవసాయం రంగంలో యాంత్రీకరణతో పాటు సాంకేతికతను జోడించాలన్న లక్ష్యంతో చంద్రబాబు పిలుపు మేరకు సహకరించటానికి బిల్ గేట్స్ ముందుకి వచ్చారు. సదస్సులో ప్రతిరోజూ 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత పెరిగిందని, ఆ క్రమంలోనే ఈ రంగానికి సపోర్ట్ గా నిలవాలని కోరారు. సీఎం చంద్రబాబునాయుడుకు, బిల్ గేట్స్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల రాష్ట్రానికి వరాలజల్లు అనివార్యమే అనే ప్రచారం జరుగుతోంది. నవ్యాంధ్ర రాష్ట్ర నిర్మాణంలో బిల్ గేట్స్ పర్యటన మైలురాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో పరిణితి ప్రదర్శిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ తో గత రెండు సంవత్సరాలుగా టచ్లో ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నారు. మన రైతుల బాగు కోసం రేపు మన రాష్ట్రానికి వస్తున్న బిల్ గేట్స్ కి సాదర స్వాగతం పలుకుతూ... వెల్కం మిస్టర్ బిల్ గేట్స్...