Sidebar

24
Mon, Mar

1997...అప్పట్లో ఐటి అంటే ఒక సంచలనం.... మైక్రోసాఫ్ అధినేత బిల్ గేట్స్ అంటే అమెరికా ప్రెసిడెంట్ లాంటి హోదా కలిగిన వ్యక్తి... సాధారణంగా రాజకీయ నాయకులతో భేటీ కావడం ప్రపంచ శ్రేణి ఐటీ ఐకాన్ ఐన బిల్ గేట్స్ కు ఇష్టం వుండదు... కాని అప్పట్లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఆయనతో భేటి కోసం ప్రయత్నించారు... ఐతే వ్యక్తిగతంగా నేతలతో భేటీకి బిల్ గేట్స్ అయిష్టతను వ్యక్తం చేశారంటూ సమాధానం వచ్చింది. అయినప్పటికీ తనదైన శైలిలో పట్టు వదలకుండా ఇతరత్రా మార్గాల ద్వారా కేవలం పది నిమిషాల కోసం చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ సంపాదించారు.

bill gates 17112017 2

బిల్ గేట్స్ మెచ్చేలా అద్భుతమైన ప్రజెంటేషన్ చంద్రబాబునాయుడు ఇచ్చారు. బాబు తీరు ఐటీ దిగ్గజాన్ని కట్టిపడేసింది. ఫలితంగా పదినిమిషాల ఇంటర్వ్యూ కాస్త 45 నిమిషాల పాటు కొనసాగింది. చంద్రబాబునాయుడు చెప్పినదంతా శ్రద్ధగా ఆలకించిన బిల్ గేట్స్ అసలు తన నుంచి ఏమి ఆశిస్తున్నారని సూటిగా అడిగారు... తాను వ్యక్తిగతంగా ఏమీ ఆశించడం లేదని కేవలం మైక్రోసాఫ్ డెవలప్ మెంట్ సెంటర్ హైదరాబాద్లో ప్రారంభించాలని మాత్రమే తాను గట్టిగా కోరుకుంటున్నట్ను చంద్రబాబునాయుడు బదులిచ్చారు. తమ కంపెనీని అమెరికా బయట విస్తరించిన పక్షంలో హైదరాబాద్లో నూరుశాతం మైక్రోసాఫ్ యూనిట్ ను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జరిగింది... మైక్రోసాఫ్ రాకతో, హైదరబాద్ రూపు రేఖలు మారిపోయాయి...

bill gates 17112017 3

ఈ పరిణామాల క్రమంలో రెండు దశాబ్దాల తరువాత, ఈ పాత మిత్రులు మళ్ళీ మన గడ్డ పై కలిసారు... ఈ సారి బిల్ గేట్స్ వస్తుంది సాఫ్ట్ వేర్ విప్లవానికి కాదు, వ్యవసాయం గతి మార్చటానికి వస్తున్నారు (ఏటి - అగ్రికల్చర్ టెక్నాలజీ)... విశాఖ వేదికగా ఏపీఐసీసీ మైదానంలో జరుగుతున్న 'ఏపీ అగ్రిటెక్‌ సమ్మిట్‌- 2017'లో పాల్గున్నారు... రైతులను సాంకేతికంగా ముందంజలో నిలిపి, వారి జీవితాల్లో మార్పు తేవాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, బిల్ గేట్స్ సంపూర్ణ సహకారం అందించాలి అని ఆశిద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read