ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైక్రోసాఫ్ అధినేత బిల్ గేట్స్ ల అనుబంధం కొనసాగుతుంది... 1997లో భారత పర్యటన సందర్భంగా ఇండియాకు వచ్చిన బిల్ గేట్స్ ను అతి కష్టం మీద కలుసుకున్న చంద్రబాబు తనదైన శైలిలో మైత్రి బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన అనంతరం బిల్ గేట్స్ ఏపీని సందర్శించాలని అభిలషించడం బాబు మార్క్ సమర్థతకు నిదర్శనంగా మారింది. గతంతో పోలిస్తే బిల్ గేట్స్ పర్యటన ఐటి కాకుండా, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వనుంది. 1997లో మొట్టమొదటిసారిగా బిల్ గేట్స్ ను కలుసుకున్న చంద్రబాబునాయుడు తాజాగా 2015 జనవరిలో దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో కూడా రాష్ట్ర విభజన అనంతరం కలుసుకున్నారు. ఇటీవల బిల్ గేట్స్ తో భేటి సందర్భంగా విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ యూనిట్ను ప్రారంభించాలని కోరారు.

bill gates 13112017 2

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత పెరిగిందని, ఆ క్రమంలోనే ఈ రంగానికి సపోర్ట్ గా నిలవాలని కోరారు. సీఎం చంద్రబాబునాయుడుకు, బిల్ గేట్స్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల రాష్ట్రానికి వరాలజల్లు అనివార్యమే అనే ప్రచారం జరుగుతోంది. నవ్యాంధ్ర రాష్ట్ర నిర్మాణంలో బిల్ గేట్స్ పర్యటన మైలురాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో పరిణితి ప్రదర్శిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ తో గత రెండు సంవత్సరాలుగా టచ్లో ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నారు.

bill gates 13112017 3

సాధారణంగా రాజకీయ నాయకులతో భేటీ కావడం ప్రపంచ శ్రేణి ఐటీ ఐకాన్ ఐన బిల్ గేట్స్ కు ఇష్టం వుండదు. 1997లో చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బిల్ గేట్స్ తో భేటీకి భారత అంబాసిడర్ ద్వారా చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. ఐతే వ్యక్తిగతంగా నేతలతో భేటీకి బిల్ గేట్స్ అయిష్టతను వ్యక్తం చేశారంటూ సమాధానం వచ్చింది. అయినప్పటికీ తనదైన శైలిలో పట్టు వదలకుండా ఇతరత్రా మార్గాల ద్వారా కేవలం పది నిమిషాల కోసం చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ సంపాదించారు. బిల్ గేట్స్ మెచ్చేలా అద్భుతమైన ప్రజెంటేషన్ చంద్రబాబునాయుడు ఇచ్చారు. బాబు తీరు ఐటీ దిగ్గజాన్ని కట్టిపడేసింది. ఫలితంగా పదినిమిషాల ఇంటర్వ్యూ కాస్త 45 నిమిషాల పాటు కొనసాగింది. చంద్రబాబునాయుడు చెప్పినదంతా శ్రద్ధగా ఆలకించిన బిల్ గేట్స్ అసలు తన నుంచి ఏమి ఆశిస్తున్నారని సూటిగా అడిగారు... తాను వ్యక్తిగతంగా ఏమీ ఆశించడం లేదని కేవలం మైక్రోసాఫ్ డెవలప్ మెంట్ సెంటర్ హైదరాబాద్లో ప్రారంభించాలని మాత్రమే తాను గట్టిగా కోరుకుంటున్నట్ను చంద్రబాబునాయుడు బదులిచ్చారు. తమ కంపెనీని అమెరికా బయట విస్తరించిన పక్షంలో హైదరాబాద్లో నూరుశాతం మైక్రోసాఫ్ యూనిట్ ను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో అనేక సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాప్ర పర్యటనకు వచ్చే విధంగా బిల్ గేట్స్ ను ఒప్పించడంలో సీఎం చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read