ఒకడు అంటాడు, చంద్రబాబు ఎవరు, కర్ణాటకలో బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వటానికి అని... ఇంకొకడు, ఆంధ్రా విషయాలు కర్ణాటకలో ఎందుకు, చంద్రబాబుది దిగజారుడు రాజకీయం అని... ఇక మన జగన్ పార్టీ అయితే, ఎవరన్నా బీజేపీని తిడుతుంటే చాలు, వాళ్ళ మీద దాడులు చేస్తుంది... ఇన్నీ చేసి, ఈ రోజు బీజేపీ ఏమి చేసిందో చూడండి.. మేము, ఆంధ్ర రాష్ట్రానికి ఇవి చేసాం, అవి చేసాం అంటూ కర్ణాటకలోని న్యూస్ పేపర్స్ లో పెద్ద పెద్ద యాడ్ లు ఇచ్చింది... మరి మొన్నటి వరకు, ఆంధ్రా విషయాలు తీసుకువచ్చి, కర్ణాటకలో ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటున్న బీజేపీ, ఈ రోజు, చేసింది ఏంటి ? సరే ఆ యాడ్ ఒకసారి పరిశీలిస్తే, ఒక్కటంటే ఒక్కటి కూడా, విభజన హామీల గురించి ప్రస్తావన లేదు... అన్ని రాష్ట్రాలకి, ఎలా అయితే చేసారో, ఆ పనులు గురించే గొప్పగా రాసారు...
ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన సంపూర్ణ అభివృద్ధికి, అన్ని అంచనాలను అధిగమించి నిరంతర కృషి చేస్తున్న మోడి ప్రభుత్వం అంటూ, ఒక పెద్ద పేజి యాడ్ ఇచ్చారు... ఇన్నాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ అబద్ధాలు అయితే ప్రచారం చేసారో, అవే అబద్ధాలు అక్కడ కూడా రాసారు... ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ సెంటిమెంట్ గా భావిస్తున్న స్పెషల్ స్టేటస్ మీద ఒక్క మాట లేదు.. పోనీ స్పెషల్ ప్యాకీజీ మీద ఒక్క మాట లేదు.. పోలవరం ప్రాజెక్ట్ కు డబ్బులు ఎంత ఇచ్చారో లేదు... అమరావతి నిర్మాణానికి ఎంత ఇచ్చారో లేదో.. రైల్వే జోన్ విషయం లేదు... ఇలా రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఆందోళనలు చేపడుతున్న ఒక్క విషయంలో కూడా, ఏమి మాట్లాడలేదు...
మరి, తెలుగు వారు ఎందుకు బీజేపీ ఓటు వెయ్యాలి ? కమలం గుర్తు బటన్ నొక్కండి, గెలిపించండి అని, ఆంధ్రా వారిని అడిగే హక్కు బీజేపీ పార్టీకు ఉందా ? రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది, కర్ణాటక ఎన్నికల్లో, ఓడించండి అని చంద్రబాబు పిలుపు ఇస్తే, కర్ణాటకతో మీకు ఏమి సంబంధం అని ఏడ్చినా రాష్ట్ర బీజేపీ నేతలు, ఇప్పుడు ఏ సంబంధం ఉందని, ఆంధ్రప్రదేశ్ కు ఇది చేసాం, అది చేసాం అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ? ఎందుకంటే కర్ణాటకలో దాదాపుగా కోటి మంది తెలుగు వారు ఉన్నారు.. వారిలో మెజారిటీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు.. అందుకే, ఆంధ్రా వాడి పేరు తలుచుకుంటేనే బీజేపీ నాయకులకు తడిచిపోతుంది.. అందుకే, దేశం మొత్తాన్ని ఎలా మభ్య పెడుతున్నారో, అలాగే ఆంధ్రా వారిని కూడా, కర్ణాటకలో మభ్య పెడదాం అనుకుంటున్నారు.. అయ్యా, మేము చాలా తెలివి గల వాళ్ళం... 125 ఏళ్ళు ఉన్న పార్టీకి, కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు.. మీరు ఎంత...