రాష్ట్రంలో ఎన్నికలు అయ్యి, మూడు నెలలు కూడా కాలేదు, అప్పుడే రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుని దించటానికి, అన్ని పార్టీలు కలిసి ఎలా పని చేసాయో చూసాం. ముఖ్యంగా బీజేపీ పెద్దన్న పాత్రలో, జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యటానికి, బీజేపీ ఎన్ని పావులు కదిపిందో, ఎన్ని క్యారక్టర్లు ఎంటర్ అయ్యయో, ఎన్ని తోక పార్టీలు పని చేసాయో, ఎన్ని క్యంపైన్లు నడిపారో, అన్నీ ప్రజలకు సుపరిచితమే. రాజకీయంగానే కాక, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో, సంస్థలను కూడా వాడుకుని, చంద్రబాబుని దించే ప్రయత్నం చేసారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికల ముందు వరకు, ఈవీఎంలు కూడా మ్యానేజ్ చేసారని చంద్రబాబు ఆరోపించారు కూడా. అయితే ఎన్నికల ఫలితాలు తరువాత మాత్రం, ఆ విమర్శలు చెయ్యలేదు.

jagan 20082019 1 2

ఇలా అన్ని విధాలుగా రాజకీయ ప్లాన్లు వేసి, చంద్రబాబుని దించి, జగన్ మోహన్ రెడ్డిని సియం పదవిలో ఎక్కించటంలో, బీజేపీ పాత్ర ఉందనేది అందరికీ తెలిసిందే. ఈ ప్లాన్లో భాగంగా, ఎన్నికల ముందు, జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మతం మారి, హిందూ మతంలోకి వచ్చారని, బీజేపీ సోషల్ మీడియా టీం ప్రచారం చెయ్యటం కూడా అందరికీ తెలుసు. ఇందులో ప్రశాంత్ కిషోర్ టీం ఎంతో పని చేసింది. స్వరూపానంద, జగన్ తో కలిసి చేసిన పూజల వీడియో చూపించి, జగన మోహన్ రెడ్డి మతం మారారని ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సియం అయ్యారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరువెయ్యటానికి బీజేపీ ప్లాన్ వేసింది. ఇందులో భగంగా, గత నెల రోజుల నుంచి జగన్ మోహన్ రెడ్డిని స్లో గా టార్గెట్ చేస్తుంది బీజేపీ.

jagan 20082019 1 3

అయితే ఈ రోజు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ ఖాతా ద్వారా, సంచలన ట్వీట్ చేసింది. జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో, డల్లాస్ లో ప్రావాస భారతీయులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా, సభ మొదట్లో, జగన్ మోహన్ రెడ్డిని జ్యోతి వెలిగించమని నిర్వాహకులు కోరారు. అయితే జగన్ నిరాకరించారు. ఈ వీడియో బీజేపీ ఈ రోజు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. జగన్ మోహన్ రెడ్డి జ్యోతి వెలిగంచమంటే వెలిగించలేదని, హిందువులను ఎన్నికల ముందు జగన్ ఫూల్ చేసారని, అన్ని దేవాలయాలకు తిరిగి రాహుల్ గాంధీ లాగా నాటకాలు ఆడారని, ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ బాగా రాసారని, ఇవన్నీ చూసి బెంగాల్ రాష్ట్రం నేర్చుకోవచ్చు అంటూ సంచలన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో, జగన్ మోహన్ రెడ్డి పై, ఎలాంటి ధోరణితో రాజకీయంగా బీజేపీ ఎదుర్కుంటుందో అర్ధమవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read