ఆపరేషన్ గరుడలో ప్రధాన ఉద్దేశం.. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పటం... తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవాలి.. సంక్షేమం ఆగిపోవాలి.. కంపెనీలు వెళ్లిపోవాలి.. పోలవరం ఆగిపోవాలి.. దీని కోసం, జగన్, పవన్ అహర్నిశలు కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు ప్రజలు నమ్ముతారని, రాష్ట్రంలో ఎదో జరిగిపోయింది అనే అభిప్రాయం ప్రజల్లో వస్తుందని, అప్పుడు రాష్ట్రంలో శాంతిబధ్రతలకు విఘాతం కలిగించి, రాష్ట్రపతి పాలన ద్వారా, మన రాష్ట్రాన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ వేసింది. అయితే, పవన్ పిల్ల ఫాన్స్ మినహా, ఎవరూ పవన్ మాటలు నమ్మటం లేదు. ఇక జగన్ చేసే ప్రతి పని సెల్ఫ్ గోల్ అవుతుంది. రాష్ట్రంలో అవినీతి కేసులో చంద్రబాబుని ఇరికించాలని ఎంత ప్రయత్నం చేసినా, రూపాయి అవినీతి కూడా కనిపెట్టలేకపోయారు. అందుకే, ఏ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వక పోవటం, ఎన్నికల సమయం మించిపోతూ ఉండటంతో, బీజేపీ నేతలు ఒక చచ్చు ఐడియాతో, ఈ రోజు ఆపరేషన్ గరుడలో, మరో పావు కదిపారు..
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఏపీలో పరిస్థితి అదుపు తప్పిదంటున్నారు. శాంతి భద్రతల సమస్య వచ్చిందని తీర్మానించారు. తమపై దాడులు జరగడమే దానికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. జోక్యం చేసుకోవాలని కోరుకున్నారు. మన రాష్ట్రంలో అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతున్నారు. అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు జరిగిన నిరసన, కొద్ది రోజుల కిందట, అనంతపురం జిల్లా పర్యటనకు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ వచ్చినప్పుడు జరిగిన నిరసన, బూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ బీజేపీ... ఏపీలో శాంతి భద్రత సమస్య ఉందని.. చెప్పుకొస్తున్నారు. ఏపీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిందని... విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు ఓ వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో తమ పార్టీ నేతలు ఎక్కడా తిరగలేకపోతున్నారన్న కారణాన్నే ప్రధానంగా చూపించారు. తమ పార్టీ నేతలకు పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలపై నమోదు చేసిన కేసులను తొలగించాలని కూడా గవర్నర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.
అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం.. బీజేపీ నమ్మించి చేసిన మోసం కారణంగా.. ప్రజాగ్రహాన్ని వారు ఎదుర్కొంటున్నారని... వారిపై దాడులకు జరగకుండా.. తాము రక్షణ కల్పిస్తున్నామంటున్నారు. ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే.. బీజేపీ నేతలు ఏపీలో ఎలా తిరుగుతారంటున్నారు. చిన్న చిన్న ఘటనలను పెద్దగా చూపించి... కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉందని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ప్రజలు బీజేపీ నేతలను అడ్డుకుంటనే.. శాంతి భద్రతల సమస్య అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న నేరాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నా... ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.