బీజేపీ వ్యవస్థలను ఎలా దిగాజారుస్తుందో చూస్తున్నాం... రాష్ట్రానికి ఒక చట్టం, ప్రాంతానికి ఒక న్యాయం, తాము ఏది అనుకుంటే అది, అది చేస్తున్నారు మోడీ - అమిత్ షా.. తమకి ఏది నచ్చితే అదే చేస్తున్నారు.. అదే చట్టం అంటున్నారు... ఇక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదే కరెక్ట్ అంటూ, ఎగబడి పోతున్నారు.. ఎవరు ప్రశ్నించినా వారు తెలుగుదేశం పార్టీ అనో, దేశద్రోహి అనో ముద్ర వేసి, తప్పించుకుంటున్నారు... కర్ణాటక ఎన్నికల ఫలితాలు తరువాత, ఎలాంటి రాజకీయం చేస్తున్నారో చూస్తున్నాం... గవర్నర్ ని అడ్డు పెట్టుకుని, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.. డబ్బు, అధికార మదంతో, ఏమి చేస్తున్నారో వారికే తెలియటం లేదు.. ఇదే పధ్ధతి సుప్రీం కోర్ట్ లో చేద్దాం అనుకుని, బొక్క బోర్లా పడ్డారు...

supreme 18052018 2

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ సందర్భంలో, బీజేపీ తరుపున లాయర్ చేసిన వాదనలు ఆశ్చర్యం కలిగించాయి.. రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో, బీజేపీకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, వింత వాదన చేసింది.. ముందుగా బలపరీక్ష తమకు కొంత సమయం కావాలని కోరింది... అంటే బేరసారాలు చేసుకోవటానికి, దీంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు, కాని ఓటింగ్ విషయంలో వీరు చేసిన వాదనతో, సుప్రీం కోర్ట్ కూడా ఆశ్చర్యపోయింది...

supreme 18052018 3

అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టును కోరారు... దీంతో సుప్రీం కోర్ట్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది... ఇదేమి కొత్త పద్ధతి అంటూ చురకలు అంటించింది... ఇలా ఎప్పుడూ జరగలేదు కదా, కొత్తగా ఇదేంటి అంటూ ఆగహ్రం వ్యక్తం చేసింది. దీనిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేలు తమ చేతులు పైకి ఎత్తడం ద్వారా మద్దతు తెలియజేయాలని, ఎమ్మెల్యేల సంఖ్యను స్పీకర్ లెక్కించాలని తీర్పు చెప్పింది.. దీంతో మరోసారి బీజేపీ వైఖరి బయట పడింది... రహస్య ఓటింగ్ పెడితే, ఎవరు ఎవరికీ ఓటు వేసారో తెలియదు.. అప్పుడు ఫిరాయింపు చట్టం అనేది రాదు... అందుకే బీజేపీ ఈ ఎత్తు వేసింది... కాని సుప్రీం ఇలాంటివి కుదరవు అంటూ, బీజేపీ విజ్ఞప్తిని తోసి పుచ్చింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read