2019 ఎన్నికల తరువాత, చాలా కొద్ది రోజులుకే పవన్ కళ్యాణ్, బీజేపీకి దగ్గర అయ్యారు. అధికారికంగా పొత్తు కూడా కుదుర్చుకున్నారు. సహజంగా ఎన్నికలు అయిన వెంటనే, పొత్తులు అధికారం పంచుకోవటానికి వాడుకుంటూ ఉంటారు కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ కి కానీ, బీజేపీకి కానీ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేదు. మరి ఇద్దరూ ఎందుకు, అప్పుడే కలిసారు అనేది వారికే తెలియాలి. పోనీ కలిసిన తరువాత, ఇద్దరూ కలిసి ఒక రాజకీయ శక్తిగా ఎదిగారా అంటే, ఎవరి దారి వారిది అనే చెప్పాలి. హైదారబాద్ జీహెచ్ఎంసి ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ ని తీసి పడేసారు. దీంతో అప్పట్లో పవన్ అలిగినా, కేంద్ర పెద్దలు మళ్ళీ ప్యాచ్ అప్ చేయటంతో, ఏదో అలా అలా నడుస్తూ వచ్చారు. తిరుపతి ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా, ఓట్లు వచ్చింది లేదు. తరువాత బీజేపీ కానీ, జనసేన కానీ ఎవరి కార్యక్రమాలు వారు చేసుకున్నారు కానీ, కలిసి చేసింది అయితే లేదు. ఇక గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ పై, వైసీపీ నేతలు విరుచుకు పడుతున్నా, తమ మిత్ర పక్షాన్ని అంటారా అని బీజేపీ నేతలు పట్టించుకుంది లేదు. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నిక వచ్చింది. నాలుగు రోజులు క్రితం, ఈ బద్వేల్ ఎన్నిక పై, సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ కలిసి, మంగళగిరి జనసేన ఆఫీస్ లో సమావేశం అయ్యారు.

pk 03102021 2

తిరుపతి మీకు ఇచ్చాం కాబట్టి, బద్వేల్ మాకు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడిగినట్టు వార్తలు వచ్చాయి. గతంలో టిడిపి తరుపున పోటీ చేసి, ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్న ఒక వ్యక్తిని కూడా జనసేన సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ, నిన్న పవన్ పుట్టపర్తి మీటింగ్ లో, తాము సంప్రదాయనికి గౌరవం ఇస్తూ, బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయటం లేదని అన్నారు. మరి తిరుపతి ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేసారో తెలియదు. సరే ఇది బీజేపీ-జనసేన కలిసి తీసుకున్న నిర్ణయం అని అందరూ అనుకున్నారు. అయితే ఈ రోజు సోము వీర్రాజు మాట్లాడుతూ, బద్వేలు ఉపఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. దీని పై సీఎం రమేశ్, ఆదినారాయణరెడ్డి, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సమీక్ష చేసారు. బద్వేలు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఒక పక్క పవన్ వద్దు అంటుంటే, సోము వీర్రాజు పోటీ చేస్తాం అని చెప్పటం పై, అసలు వీరి ఇద్దరికీ పొత్తు ఉందా లేదా అనే విషయం ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ఇద్దరూ ఎందుకు పొత్తులో ఉన్నారో కూడా అర్ధం కాని పరిస్థితి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read