దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోని బిజెపి కార్యాలయం వద్ద కొందరు బిజెపి గూండాలు సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై దాడి చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన అగ్నివేష్ (79)పై బిజెపి గూండాలు సామూహికంగా దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై అగ్నివేష్ మాట్లాడుతూ వాజ్‌పేయి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు అక్కడికి వెళ్లానని, పోలీస్ బందోబస్తు ఉండడంతో నడుచుకుంటూ వెళ్తున్నట్లు తెలిపారు. అకస్మాత్తుగా కొందరు యువకులు తన మీద దాడి చేశారని, తన తలపాగాను పడేసి దేశద్రోహి అంటూ కొట్టడం ప్రారంభించారని ఆయన తెలిపారు.
ఈ ఘటన అధికార పార్టీ కార్యాలయం వద్ద చోటుచేసుకోవడంతో అక్కడి సిసికెమెరాల్లో రికార్డయింది. కొందరు బిజెపి కార్యకర్తలు అగ్నివేష్‌ను వెంబడిస్తూ, ఆయనను తోసేస్తుండటం, 'దేశద్రోహి' అని తిడుతూ, కొట్టండి అంటూ మరికొంత మందిని పురిగొల్పినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపి స్తోంది. ఆయన తలపాగాను ఒక వ్యక్తి లాగిపడేయగా, మరో మహిళ ఆయనను చెప్పుతో కొట్టేందుకు యత్నిస్తు న్నట్లు వీడియోలో ఉంది. దీంతో పోలీసులు అగ్నివేష్‌ను ఒక వ్యాన్‌లో ఎక్కించుకుని భద్రతా వలయంలోకి తీసుకెళ్లినా ఆయనపై దాడి చేసేందుకు వారు ప్రయత్నించారని పోలీస్ అధికారులు తెలిపారు. అగ్నివేష్ పై దాడి జరగడం ఇది రెండవ సారి.
గతంలో జులై 17న జార్ఖండ్‌లోని పాకూర్‌లో బిజెపి యువ మోర్చా కార్యకర్తలు ఆయనపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి దాడి ఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజిలో అగ్నివేష్ నేలపై పడివున్నారు. ఒక గుంపు ఆయనపై దాడి చేస్తుండగా వారి నుండి రక్షించుకునేందుకు తన చేతులను అడ్డుపెట్టుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. కాగా, ఆయన దుస్తులు కూడా చిరిగిపోయాయి. అయితే సాక్ష్యాధారాలు ఉన్నప్పటికి ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. నివాళి అర్పించటానికి వచ్చిన అగ్నివేశ్ మీద దాడి చేసిన ఈ రౌడీమూకలా భారతీయ సంస్కృతి గురించి మాట్లాడేది !! శత్రువుకి కూడా గౌరవంగా అంత్యక్రియలు జరిపించే సంస్కృతి నా ఈ భారతీయ సంస్కృతి. పగవాడైనా మరణించాక మనవాడే అనుకొని ఉత్కృష్టమైన సాంప్రదాయం మనది. అలాంటిది మరణించిన వ్యక్తి కి నివాళి అర్పించటానికి వచ్చిన వ్యక్తి మీద దాడి చేసిన, మోదీ షాల బిజెపి అంటే అసహ్యం రోజు రోజుకి పెరుగుతుంది ఇందుకే.