అడ్డంగా దొరికిపోయారు... అవిశ్వాసం అంటూ విశ్వాసం చూపిస్తున్న జగన్ పార్టీ A2 విజయసాయి రెడ్డి, అవిశ్వాసాన్ని అడ్డుకుంటున్న టిఆర్ఎస్, వీరిద్దరినీ ఆడిస్తున్న, బీజేపీ... ముగ్గురూ ముచ్చటగా దొరికిపోయారు... ఎక్కడో కాదు పార్లమెంట్ లోనే... పార్లమెంట్ వాయిదా అనంతరం, పార్లిమెంట్ హాల్ లో, ఈ దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు.... రాజ్యసభ ప్రారంభం అయిన 5 నిమషాలకే వాయిదా పడింది... అప్పటి నుంచి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, పార్లమెంట్ హాల్ లో, అటు ఇటు తిరుగుతూ, బీజేపీ ఆదేశాల కోసమా అన్నట్టు, ఎదురు చూస్తూ ఉన్నారు...
ఇంతలో, పార్లమెంట్ వాయిదా పడగానే, పార్లమెంటరీ వ్యహహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్, తెరాస పక్షనాయకుడు జితేందర్‌రెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు... వారితో కలిసి విజయసాయి రెడ్డి దాదాపు అరగంటకు పైగా మాట్లాడారు... ఏమి మాట్లాడారో తెలియదు కాని, బయట మాత్రం, ఈ రోజు మా పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అంటూ, విజయసాయి రెడ్డి, జితేందర్‌రెడ్డి, పార్లమెంటరీ వ్యహహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ ను అడుగుతున్నరేమో అని సెటైర్ లు పేలుతున్నాయి...
నిజానికి వీళ్ళ డ్రామాలు అన్నీ ఇన్నీ కాదు... అవిశ్వాసం పెడుతున్నాం అంటూ, ఆ ముందు రోజే విజయసాయి రెడ్డి ప్రధాని కార్యలయంలో ప్రత్యక్షం అయ్యారు... దీంతో చంద్రబాబు, ఎదో గేమ్ ఆడుతున్నారని తెలుసుకుని, వెంటనే తన ఎంపీల చేతే, అవిశ్వాసం పెట్టించి, ఒక్క గంటలో దేశంలోని అన్ని విపక్షాలని ఏకం చేసి, మోడీ, అమిత్ షా ను పరిగెత్తించారు... అప్పటి నుంచి, కెసిఆర్, తన ఎంపీల చేత, రోజు అవిశ్వాసం రాకుండా, డ్రామాలు ఆడిస్తున్నారు... ఒక పక్క మోడీకి వ్యతిరేకం అంటూ, బీజేపీ ఆడిస్తున్న స్క్రిప్ట్ ప్రకారం ఆడుతున్నారు... దానికి ఉదాహరణ ఈ భాగోతం... పార్లమెంటరీ వ్యహహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్, రేపు ఏమి చెయ్యాలో, రెండు పార్టీలు అడుగుతున్నాయి... ఇలాంటి తెరాస పార్టీకి, కెసిఆర్ కు, పవన్ హాట్స్ ఆఫ్ అంటూ, చెల్లలు కవిత అంటూ మద్దతు.. ఇదీ మన రాష్ట్రం మీద జరుగుతున్న కుట్రలు...