వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండూ ఒకటే అనే విషయం, రాజకీయాలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. అధికారికంగా ఇద్దరికీ పొత్తు లేకపోయినా, ఇద్దరూ కలిసి చంద్రబాబుని దింపటానికి చేయని ప్రయత్నం లేదు. అయితే రాను రాను కేంద్రంలో బీజేపీ నేతలు, వైసీపీకి కొంచెం దూరం జరిగారు అనే సంకేతాలు ఉన్నా, రాష్ట్రంలో బీజేపీ నేతలు మాత్రం, ఇప్పటికీ వైసీపీతో మంచి సంబంధాలు ఉన్నట్టే కనిపించింది. సోము వీర్రాజు ఆధ్యక్షుడు అయిన తరువాత, ఆయన చంద్రబాబు జపం తప్ప, వేరేవి పెద్దగా చేసిన సందర్భాలు లేవు. అందుకే జనసేన కూడా, రాష్ట్ర బీజేపీ నేతలతో కొంచెం దూరంగా ఉందనే అభిప్రాయం కూడా ఉంది. ఇది ఇలా ఉంటే, కేంద్రంలో బీజేపీ నేతలు మాతో మంచిగా ఉన్నారు అనే అభిప్రాయం కలిగించటానికి, విజయసాయి రెడ్డి ఎందుకో కానీ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గతంలో కూడా, మేము అన్నీ మోడీ, అమిత్ షా కి చెప్పే చేస్తాం అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అయితే అది బీజేపీ ఖండించింది అనుకోండి వేరే విషయం. అయితే ఇప్పుడు మరోసారి ఇలాంటి కధనం ఒకటి జాతీయ మీడియాలో రావటం చర్చనీయంసం అయ్యింది. జగన బెయిల్ రద్దు కేసుతో పాటు, ఏపిలో చేస్తున్న అప్పులు విషయం, ఇలా అన్ని విషయాల్లో బీజేపీ, జగన్ కు వ్యతిరేకంగా ఉందని అర్ధం అవుతుంది.
ఈ అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తే ఏమి అవుతుంది అనుకున్నారో ఏమో కానీ, నిన్న జాతీయ మీడియాలో ఒక కధనం వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి, ఎన్డీఏలో చేరి, క్యాబినెట్ లో మంత్రి పదవులు తీసుకోవాలి అనుకున్నారు అనేది ఆ కధనం సారంశం. అయితే చివరి నిమిషంలో, జగన్ మోహన్ రెడ్డి రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టటంతో డీల్ కుదరలేదు అంట. జాతీయ మీడియాలో వచ్చిన ఈ కధనంలో, విజయసాయి రెడ్డి అభిప్రాయంగా, మాటలు నడిచాయి, అవి ఏమిటి అనేది మా ముఖ్యమంత్రిని అడగాలని ఆయన చెప్పటంతో, ఈ కధనం నిజమే అని అందరూ అనుకున్నారు. అయితే ఈ కధనంతో, విజయసాయి రెడ్డి మాటలను బీజేపీ ఖండించింది. రౌడీల పార్టీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం అంటూ బీజేపీ ఖండిస్తూ, తాము జనసేనతో మాత్రమే ఉంటాం అని చెప్పింది. అయితే ఈ కధనం వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారని, ఢిల్లీలో తమ పరపతి ఏ మాత్రం తగ్గలేదు అని చూపించుకోవటానికి, విజయసాయి రెడ్డి ఈ కధనం వేయించారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి.