ట్విట్టర్‌లో చురుకుగా ఉండే నేతల్లో సుష్మా స్వరాజ్ ఒకరు. సాయం అందించాలన్నా.. ఆకతాయిలకు ఘాటుగా సమాధానమివ్వాలన్నా.. ఆమె ఎప్పుడూ ముందుంటారు. అయితే ఈ సారి సొంత పార్టీ నేతలు చేస్తున్న పనితో తీవ్ర ఆవేదన చెందారు. సుష్మా కుటుంబం అంతా, చాలా బాధపడుతున్నారు. లక్నోలో ఓ హిందూ-ముస్లిం జంటకు విదేశాంగ శాఖ వేగంగా పాస్‌పోర్టు మంజూరు చేయడం, దంపతులను అవమానించిన ఆరోపణలపై ఓ పాస్‌పోర్టు అధికారిని బదిలీ చేయడం ఇటీవల సంచలనం సృష్టించింది. ఈ విషయం పై, బీజేపీ కార్యకర్తలు ఉన్మాదులులాగా సుష్మా పై సోషల్ మీడియాలో దాడి మొదలు పెట్టారు. ముస్లింలకు సహాయం చెయ్యటమే తప్పు అన్నట్టుగా చలరేగిపోయారు.

sushma 03072018 2

‘ఇటీవల ఆమె ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్న కిడ్నీ ముస్లింది’ అంటూ ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. కొందరు ‘సుష్మా బేగమ్‌’ అని సంబోధిస్తున్నారు. ఆమె పాకిస్థాన్‌ జెండా పట్టుకున్నట్లుగా మార్ఫింగ్‌ ఫొటోలు పెడుతున్నారు. ముఖేశ్‌ గుప్తా అనే వ్యక్తి హద్దులు మీరాడు. ‘ఇంటికి వచ్చాక మీ భార్యను కొట్టండి. ముస్లింలను బుజ్జగించడం ఆపమని చెప్పండి’ అని సుష్మ భర్త స్వరాజ్‌ కౌశల్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు. ఇలా అనేక రకాలుగా, ఆమెను సొంత పార్టీ నేతలే క్షోభ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం కిక్కురుమనడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలు మంత్రివర్గ సహచరులంతా మౌనముద్ర దాల్చారు. తప్పుచేసిన వారికి హోంమంత్రి నుంచి ఎలాంటి హెచ్చరికలు లేవు.

sushma 03072018 3

విపక్షాల నుంచి ఆమెకు మద్దతు వెల్లువెత్తింది. కశ్మీరు మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆమెకు అండగా నిలిచారు. కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌పై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. బీజేపీ అగ్రనాయకత్వం ఆమెకు మద్దతుగా నిలవకపోవడం దురదృష్టకరమన్నారు. సుష్మాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ వెనుక బీజేపీ సోషల్‌ మీడియా విభాగం ఉందని అసద్‌ ఆరోపించారు. మొత్తానికి ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మన దేశంలో, కేంద్ర మంత్రిగా ఉంటూ, ఒక ముస్లింకు సాయం చెయ్యటమే, ఆ కేంద్ర మంత్రి తప్పు. బీజేపీ ఉన్మాదానికి, ఇది పరాకాష్ట..

Advertisements

Advertisements

Latest Articles

Most Read