ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఆందోళన చేస్తున్నా కేంద్రం మాత్రం, అసలు పట్టించుకోవటం లేదు... ఈ రోజు ఏపి పై ఇదే ఆఖరి మాట అంటూ, కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది... హోదా అనే మాట లేదని, హోదా ఇవ్వడం కుదరదని కుండబద్దలుకొట్టింది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతోన్న ఆంధ్రప్రదేశ్ నేతలకు, ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ షాక్ ఇచ్చింది. పన్ను రాయితీలు సాధ్యపడే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపింది. అంతేకాదు, ఆత్మ గౌరవం అంటూ ఎమోషన్ లు పెంచి, రాజకీయ వేడిని పెంచుకుని ఆంధ్రప్రదేశ్ నేతలు గేమ్ ఆడుతున్నరాని సంచనల వ్యాఖ్యలు చేసింది.
ఈ రోజు తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారని, ఒకవేళ రాయితీ ఇస్తే రేపు తమిళం, మలయాళం సెంటిమెంట్ అంటూ మరో ప్రాంతం వారు అంటారని పేర్కొంది.అప్పుడు వారి సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలాంటి సెంటిమెంట్ కు, ఎమోషన్స కు లొంగేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది.. కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన హోదా తమకెందుకు ఇవ్వరని అడగడంతో అర్థం లేదని వ్యాఖ్యానించింది... ఇప్పటి వరకు రూ. 12వేల 500 కోట్లు ఏపీకి ఇచ్చామని, అయితే ఇంత వరకు ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పలేదని కేంద్ర ఆర్థిక శాఖ కొత్త వాదనకు తెర లేపింది...
ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని ప్రకటించింది. హోదాకు బదులుగా ఇంతకుముందు ప్రకటించిన ప్యాకేజీకి మాత్రమే తాము పరిమితమని, మిగిలినవి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి... నిన్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ అయింది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జైట్లీకి స్పష్టం చేసింది. అంతేకాదు.. పన్ను రాయితీలు కూడా కల్పించాలని కోరింది. .. ఏపీ కంటే వెనుకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయని, రాయితీలు ఇస్తే ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని కేంద్రం తెలిపింది. హోదా ఇవ్వటం కుదరదని, మొత్తంగా రాయితీలు ఇవ్వాలా? వద్దా? అనేది వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి... మొత్తంగా, ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది...