ప్రపంచం అంతా క-రో-నా-తో, అల్లాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం మాత్రం, రాజకీయం చెయ్యటంలో దూసుకుపోతుంది. పోనీ ఇక్కడ ఏమన్నా కేసులు లేవా, క-రో-నా ఫ్రీ జోన్ లో ఉన్నామా అంటే, 800 కేసులు పైన, 85 శాతం రాష్ట్రం రెడ్ జోన్ లో ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇలాంటి సమయంలో, ప్రభుత్వం మరింత అలెర్ట్ గా ఉండి, విపక్షాలను కూడా కలుపుకుని, కరోనా పై పోరాటం చేసి, ప్రజలను కాపాడాలి కానీ, ఇక్కడ మాత్రం అందుకు రివర్స్ జరుగుతుంది. కరోనా పై విపక్షాలు, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినా, ఎదన్నా ప్రశ్న అడిగినా, వారికి ఉందే. ప్రభుత్వం వారి పై వ్యక్తిగత దాడులకు దిగటం, వారిని టార్గెట్ చెయ్యటం, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. మొన్న బీజేపీ విషయంలో కూడా అదే జరిగింది. టెస్టింగ్ కిట్ల విషయంలో, ఛత్తిస్‌గడ్‌ ప్రభుత్వం అతి తక్కువ రేటుకు టెస్టింగ్ కిట్లు కొంటె, అదే కంపెనీ నుంచి, మీరు ఎందుకు డబల్ రేటు పెట్టి కొన్నారు, దీని వెనుక ఏమి జరిగింది అని, ఏపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారయణ అడగటమే పాపం, వైసీపీ నేతలు విరుచుకు పడుతున్నారు.

మమ్మల్నే రేట్లు గురించి అడుగుతువా అంటూ, కన్నా పై వ్యక్తిగత దాడికి దిగారు. సహాయంగా, కులం అంటగట్టి తిట్టేవారు, కాని ఈ విషయంలో అలా కుదిరే అవకాసం లేకపోవటంతో, చంద్రబాబుకి, 20 కోట్లకు కన్నా అమ్ముడుపోయారు అంటూ విజయసాయి రెడ్డి ఆరోపణలు చేసారు. మరో బీజేపీ నేత సుజనా చౌదరి ఈ విషయంలో బ్రోకర్ అన్నారు. అంతే కాదు, కన్నా, పురందేశ్వరి, బీజేపీ హైకమాండ్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారో తనకు తెలుసు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో, రోజు రోజుకీ బీజేపీ పై, వైసీపీ ఎదురు దాడి చెయ్యటంతో, విషయం తెలుసుకున్న అమిత్ షా, రంగంలోకి దిగారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు ఆదేశాలు ఇచ్చి, ఈ విషయం పై, ఏపి బీజేపీ నేతలకు ఒక డైరక్షన్ ఇవ్వాల్సిందిగా, నడ్డాను కోరారు.

దీంతో నడ్డా, అఖిల భారత సంఘటనా సహ కార్యదర్శి సతీష్‌జీ చేత, రాష్ట్రంలో జరిగిన మొత్తం విషయం పై రిపోర్ట్ తెప్పించుకున్నారు. స్కాం బయట పెడితే, విజయసాయి రెడ్డి , వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని, నిర్ధారణకు వచ్చారు. దీంతో నిన్న రాత్రి, ఏపి బీజేపీ నేతలతో, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు తిప్పి కొట్టాలని, అందరూ కలిసి కట్టుగా, ఎదుర్కోవాలని, దీంతో వేరే లైన్ లేదని తేల్చి చెప్పారు. ఏపి బీజేపీలో ఉన్న ఒకరిద్దరు నేతలు, లోపాయికారీగా విజయసాయి రెడ్డికి సహకరించటం వల్లే, ఇలా రేచ్చిపోతున్నారని, అధిష్టానం దృష్టికి కొంత మంది నేతలు తీసుకు వెళ్లారు. అయితే దీని పై స్పందించిన నడ్డా, అవేమీ కుదరవు అని, అందరూ ఏకతాటి పై ఉండి, వైసీపీ ఎదురు దాడిని తిప్పికొట్టాలని అన్నారు. ఎవరూ వైసీపీ ట్రాప్ లో పడవద్దు అని, కిట్ల స్కాం తేల్చే వరకు, వదిలి పెట్టవద్దు అని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read