గత నాలుగేళ్ల నుంచి అస్తవ్యస్థ నిర్ణయాలతో ప్రజల జీవితాలతో చెలగాటమాడిన బిజెపి పెద్దలకు, ఎన్నికల సమయాన భారత ఓటర్లు షాక్‌ ఇవ్వబోతున్నారని ఓ సర్వే తేల్చింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే, అధికార బిజెపికి 137 నుంచి 175 సీట్లు మాత్రమే వస్తాయ, ఆ పార్టీ నిర్వహించుకున్న అంతర్గత సర్వేలో తేలిందట. మొత్తం దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలపై ఒక జాబితా రూపొందించి, ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నిసీట్లు ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తాం, అనేదాని పై బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం చర్చించుకుందట. వారు నిర్వహించుకున్న సర్వే ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ 150సీట్ల మార్క్‌ను దాటడం కష్టంగా కనిపిస్తోందట.

survey 05082018 2

2014 ఎన్నికల్లో ఏ రాష్ట్రం నుంచి ఎన్ని సీట్లు గెలిచాం, ప్రస్తుతం ఎన్ని గెలవబోతున్నాం, గట్టిగా కష్టపడితే వచ్చే సీట్లు ఎన్ని అనేదానిపై విశ్లేషణ చేసుకున్నారట. గట్టిగా కష్టపడ్డా, ఇతరత్రా ప్రలోభాలకు గురిచేసినా, మొత్తం మీద 175 సీట్లకు మించవని ఆసర్వే తేల్చిందట. రాష్ట్రాలవారిగా గతంలో గెలిచిన సీట్లు, ప్రస్తుతం..ఉన్న అవకాశాలను పార్టీ లోతుగా విశ్లేషించుకుందట. మొదట ఆంధ్రప్రదేశ్‌ విషయాన్ని తీసుకుంటే, గత ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకుని ఆ పార్టీ రెండు సీట్లను గెలిచింది. ఈ సారి, ఆ సీట్లు రావని, పార్టీ సర్వేలో తేలిందట. అదే విధంగా దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, బీహార, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,ఒరిస్సా, తెలంగాణ, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కష్టాలు ఎదురు కానున్నట్లు పార్టీ నిర్వహించిన సర్వే తేల్చి చెప్పిందట.

survey 05082018 3

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 75 సీట్లు గెలిస్తే, ఈ సారి బిజెపికి దక్కబోయేది 25 నుంచి 30 మాత్రమేనట. అదే విధంగా ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ లో గత ఎన్నికల్లో,ఆ పార్టీ 26కు 26 గెలిస్తే.ఈసారి 10 స్థానాలు దక్కితే గొప్పేనట. కర్ణాటకలో గత ఎన్నికల్లో 17 స్థానాలు సాధిస్తే, ఈసారి 6కు మించవు. అదే విధంగా మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి 27 స్థానాలు దక్కితే, ఈ సారి 10 నుంచి 17 మధ్యమాత్రమేనట. మహారాష్ట్రలో గతంలో 28 గెలిస్తే, ఈసారి 10 దక్కుతాయని సర్వే తేల్చింది. రాజస్థాన్‌లో గత ఎన్నికల్లో మొత్తం 25సీట్లను స్వీప్‌ చేసి కమలం పార్టీ ఈసారి ఐదు స్థానాలతో సరిపెట్టుకోవాలట. కాగా ఒరిస్సాలో మాత్రం బిజెపికి కాస్తా కూస్తో అవకాశం ఉందట. గత ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్‌ స్థానం మాత్రమే గెలుచుకున్న బిజెపి ఈ సారి అక్కడ 10స్థానాల వరకు సాధిస్తుందట. బీహార్‌లో గత ఎన్నికల్లో 22 స్థానాలు సాధించిన బిజెపి ఈ సారి 10 నుంచి 20 స్థానాలు సాధించే ఛాన్స్‌ ఉందట. ఆంధ్రాకు అన్యాయం చేసిన ఆ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గుండు సున్నకొట్టడం ఖాయమని కూడా సర్వే తేల్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read