మోడీ - అమిత్ షా ద్వయం మీద, దేశ ప్రజలకే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా మబ్బులు వీడి, అసలు రూపం కనిపిస్తుంది... ఆ పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ బోరా బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు... పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీకి, ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు... దేశం నలుమూలలకు బీజేపీని విస్తరించేందుకు ఐటీ సెల్ ద్వారా ప్రద్యుత్ బోరా కీలక పాత్ర పోషించారు... ఈయన రాజీనామాకు కారణం, పార్టీలో చేస్తున్న పనులు అంటూ, అమిత్ షా కు ఘాటు లేఖ రాసి మరీ, రాజీనామా చేసారు... ఈ ఉదంతంతో, మరోసారి బీజేపీ ఎలాంటి పార్టీ అనే విషయం బయట పడింది...

bjp it cell 21032018 2

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ‘‘ప్రజాస్వామ్య సంప్రదాయానికి తూట్లు పొడవడంపై’’ కలత చెందాననీ.. మిగతా పార్టీలకు బీజేపీకి తేడా లేకుండా పోయిందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘‘పార్టీకి బాగా పిచ్చి ముదిరింది. ఎలాగైనా గెలిచితీరాలన్న ఉద్దేశ్యంతో పార్టీ విలువలను తుంగలో తొక్కేశారు. 2004లో నేను చేరిన పార్టీ ఇది కాదు..’’ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

bjp it cell 21032018 3

పార్టీ సాగిస్తున్న ప్రస్తుత విధానాలతో బీజేపీపై తనకు నమ్మకం పోయిందన్నారు. ‘‘ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా దేశానికి ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం. ఇందుకు బీజేపీ కూడా మినహాయింపు కాదు. ప్రజలు ఇతర అవకాశాల వైపు చూస్తున్నారు..’’ అని బోరా పేర్కొన్నారు. అస్సాంలో కాంగ్రెస్, ఆమాద్మీ, ఏజీపీ పార్టీలు తనకు అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని ఎప్పుడూ స్వీకరించలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా పనితీరుపై ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ బోరా తన నాలుగు పేజీల లేఖలో లేవనెత్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read