Sidebar

14
Wed, May

ఢిల్లీ పర్య టనలో ఉన్న జనసేన అధినేత వవన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో సమావేశ మయ్యారు. అంతేగాక ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం అమరావతిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరుగుతున్న సమయంలో ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రావడంతో వవన్ వెంటనే ఢిల్లీ హుటాహుటిన వెళ్లిన విషయం విదితమే. రెండ్రోజులుగా ఢిల్లీలోనే ఉన్న పవన్, నాదెండ్ల మనోహర్ సంఘ్ వరివార్ నేతలతోనూ సమావేశమయ్యారు. బిజెపితో సమావేశం ద్వారా ఎపిలో కొత్తగా రాజకీయ సమీకరణాలకు తెరలేచింది. ప్రస్తుతం బిజెపి, జనసేనలు రాష్ట్రంలో కలిసి నడిచేందుకు కార్యాచరణ దాదాపు ఖరారైనట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రానున్న రోజుల్లో ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశాలపైనా పక్కా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. అమరావతి రైతుల ఆందోళన, ప్రభుత్వ ఆలోచనలు ఏపీ బిజెపి తాజాగా చేసిన తీర్మానం, తన అభి ప్రాయం గురించి పవన్ ఈ భేటీలో సవివరంగా వివరించినట్లు తెల్సింది.

pk 14012019 2

నడ్డాతో ఆంతరంగిక సమావేశం వెనుక.. బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జేపీ నడ్డా త్వరలో బిజెపి జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ రైతులుచేస్తున్న ఆందోళనపై పూర్తి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎపిలో బిజెపి, జనసేన పొత్తుపై కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో పొత్తులేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల నష్టపోయామని వవన్ తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిద్వారా వవన్ రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు పార్టీ నేతలకు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపైన వవన్ సానుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తానా సభల సమావేశంలో రామ్ మాధవ్ తో సమావేశం సమయంలోనే బిజెపితో స్నేహం గురించి అంకురార్పణ జరిగింది.

pk 14012019 3

ఎపిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపితో పోటీగా ప్రభుత్వంపై జనసేన పోరాటం చేస్తుంది. ప్రస్తుత పరిస్థి తుల్లో టిడిపితో కంటే బిజెపితోనే జత కట్టడం ద్వారా భవిష్యత్ రాజకీయాల్లో మేలు జరుగుతుందనే అంచనాలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు కలిసి నడుస్తాయా లేక రాష్ట్ర సమన్వలపట్ల మాత్రమే కేంద్రంతో సయోధ్య అనే అంశంపై స్పష్టతరాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని, అమిత్ షా ఢిల్లీ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నారు. అందువల్లే నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇదే నమయంలో వారిద్దరి మధ్య ఎపి అంశాలపై కీలకచర్చ జరిగినట్లు తెలుస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరితే ఈ ఎన్నికల నుంచే వారు పొత్తుతో ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. నడ్డాతో సమావేశం ముగిసిన వెంటనే పవన్ తిరిగి ఏపీకి పయనమయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read