దేశం మొత్తం మా ఆధీనంలోనే ఉంది అనే అహంకారం, ప్రతి బీజేపీ నేతకు ఉంది. అందుకే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తున్నాం. లెక్కలేని తనం, హేళన చెయ్యటం, తక్కువుగా చూడటం, ఇవన్నీ వీళ్ళకు మామూలే. అయితే, ఏ మాత్రం పట్టులేని అందప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీళ్ళు ఇలాగే రెచ్చిపోతున్నారు. కనీసం ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ నేతలు, దేశంలో అధికారం మాదే అనే అహం, మన రాష్ట్రంలో కూడా చూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విజయావాడలో జరిగింది. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు పై, బీజేపీ నేత రెచ్చిపోయాడు. నేను ఎంపీగా పోటీ చేసాను, నా కారే ఆపుతావా అంటూ, కానిస్టేబుల్ పై కారు దూకించే ప్రయత్నం చేసాడు. అతను తప్పుకోవటంతో, కార్ వేగంగా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా కారును నిలపటమే కాకుండా కారును తీయాలని కోరిన ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన లాకా వెంగళరావు యాదవ్‌ను సూర్యారావుపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శనివారం రాత్రి మహాత్మాగాంధీ రోడ్డులో రెండో పట్టణ ట్రాఫిక్ సీఐ సుబ్బరాజు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని రోడ్డుపై ఒక కారు నిలిపి ఉంది. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉండటంతో దాన్ని అక్కడ నుంచి తీయాలని పోలీసులు కారు యజమాని వెంగళరావు యాదవ్‌ను కోరారు.
పోలీసుల మాటలను లెక్క చేయకపోవటంతో దాన్ని పోలీసు క్రేన్ సాయంతో తొలగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వెంగళరావు యాదవ్ పోలీసు క్రేన్‌పైకి ఎక్కించి ఆపై అడ్డుకుంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి దురుసుగా కారును పోనిచ్చారు. దీనిపై ట్రాఫిక్ సీఐ సుబ్బరాజు సూర్యారావుపేట పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రమాదకరంగా వాహనం నడపటంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు వెంగళరావు యాదవ్‌పై కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు. 2009 ఎన్నికల్లో, ఇతను విజయవాడ ఎంపీగా, బీజేపీ తరుపున పోటీ చేసాడు.