రాష్ట్ర రాజధాని అమరావతికి అన్యాయం చేసి, రాష్ట్రానికి మూడు రాజధానులు పెడతాను అంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పై, బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయాణ, అమరావతిని ఇక్కడే ఉంచాలీ అంటూ ఉద్యమాలు కూడా చేసారు. అలాగే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా, అమరావతికి మద్దతుగా ప్రకటనలు చేసారు. ప్రతి రోజు కొంత మంది బీజేపీ నేతలు, అమరావతి వెళ్లి రైతులకు మద్దతు పలుకుతున్నారు. అయితే మరో పక్క బీజేపీలోని మరో వర్గం మాత్రం, జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. మొదట్లో విష్ణు వర్ధన్ రెడ్డి, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడినా, తరువాత మాట మార్చి, అమరావతి ఇక్కడే ఉండాలి అంటూ ప్రకటించారు. అయితే మరో బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు మాత్రం, దీనికి పూర్తీ భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏపి బీజేపీ నేతలకు పూర్తీ భిన్నంగా, జీవీఎల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.

gvl 01012020 2

ఏపి బీజేపీ నేతలు, కేంద్రం కలుగ చేసుకుంటుంది అని చెప్తున్నా, జీవీఎల్ మాత్రం, కేంద్రానికి సంబంధం లేదని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోదని తేల్చి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏమి చేసుకున్నా, రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని జీవీఎల్ అంటున్నారు. అయితే జీవీఎల్ చేసిన ఈ ప్రకటన పై, రాష్ట్ర బీజేపీ నేతలు, జీవీఎల్ కు షాక్ ఇచ్చారు. నిన్న గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందినా బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ, జమ్ముల శ్యాంకిషోర్‌, కొమ్మినేని సత్యన్నారాయణ, తుళ్లూరులో ఆందోళన చేస్తోన్న రైతులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ, జీవీఎల్ వ్యాఖ్యలు పట్టించుకునే అవసరం లేదని, ఇప్పటికే బీజేపీ స్టాండ్ ఏంటో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారని అన్నారు.

gvl 01012020 3

అమరావతి పై బీజేపీ వైఖరి , జీవీఎల్‌ నరసింహారావుకు తెలియదని, ఆయన కొన్ని రోజులు ఇక్కడ, మరికొన్ని రోజులు ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఉంటారని అన్నారు. అతని మాటలు పట్టించుకోవసరం లేదని, రైతులు త్వరలోనే శుభవార్త వింటారని జీవీఎల్ అన్నారు. అమరావతిని రాజధానిగా కేంద్రం గుర్తించింది కాబట్టే, రూ.2,500కోట్లు ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతి మారుస్తాం అంటే, కేంద్రం చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు. అలాగే జీవీఎల్ వ్యాఖ్యల పై, కన్నా లక్ష్మీనారాయణ కూడా మాట్లాడుతూ, రాష్ట్రాలకు కొన్ని హక్కులుంటయి, వాటిని కేంద్రం హరించదు అన్నారని, అయితే రాష్ట్రానికి హక్కులున్నట్లే స్టేక్‌ హోల్డర్లకు కూడా ఉంటాయి, వాళ్లను కాదని రాజధాని మార్చేందుకు రాష్ట్రప్రభుత్వానికి హక్కు లేదు అని కన్నా అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read