గుజరాత్ ఎన్నికల్లో, చావు తప్పి కన్ను లొట్ట పోయినా, రాష్ట్ర బీజేపీ నాయకులకు జ్ఞాదోయం అవ్వలేదు... కనీసం వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేని బీజేపీ నాయకుడుగా పేరు ఉన్న సోము వీర్రాజు విర్రవీగుతూ, నేను 2019లో ఏపి ముఖ్యమంత్రి ఎవరో నేను డిసైడ్ చేస్తా అంటూ, గుజరాత్ ఎన్నికల గెలుపు, ఈయన వల్లే అన్నంత బిల్డ్ అప్ ఇచ్చాడు.. కట్ చేస్తే, ఇవాళ తమిళనాడులో బీజేపీ స్థానం ఏంటో చూపించారు... దక్షినాది రాష్ట్రాల్లో బీజేపీ అంటే ఎంత కోపం ఉంది మరో సారి అర్ధమైంది... తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర పరిధిలోని ఆర్కే నగర్ నియోజకవర్గ ఓటర్లు బీజేపీకి ఊహించని తీర్పు ఇచ్చారు... కనీసం నోటా మీటకు దక్కిన ఓట్లు కూడా సదరు జాతీయ పార్టీకి దక్కకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
ఈ రిజల్ట్ చూసి చివరకు సొంత పార్టీ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ‘‘తమిళనాడులో బీజేపీ రికార్డు : ఓ జాతీయ పార్టీ ‘నోటా’లో మూడో వంతు ఓట్లతో సరిపెట్టుకుంది. బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది...’’ అని వ్యాఖ్యానించారు. టీటీడీ దినకరన్ గెలుపు ఖరారైన నేపథ్యంలో, అతి త్వరలోనే అన్నాడీఎంకే, శశికళ వర్గాలు కలుస్తాయని తాను భావిస్తున్నానని, రెండు వర్గాలూ కలిసి 2019 పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తాయని తాను అంచనా వేస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించారు.
అయితే ఎన్నికల్లో నోటాకు 935 ఓట్లు పడగా.. బీజేపీకి కేవలం 519 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇది ప్రజల స్పష్టమైన తీర్పు... 2జీ కేసు తీర్పుతో పాటు, బీజేపీ తమిళనాడు రాజాకీయాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలి అనుకోవటం కూడా ప్రజల ఆగ్రహానికి గురైంది.. అందుట్లో ఆర్కే నగర్ నియోజకవర్గ పరిధిలో తెలుగు వారు కూడా చాలా ఎక్కువ... మొన్న ఒకాయిన కాకినాడ వచ్చి మీది 13 జిల్లాల పార్టీ అని హేళన చేసాడు... ఆ సార్ కి ఇప్పుడు అర్ధమైందో లేదో, 29 రాష్ట్రాల పార్టీకి, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి... అయ్యా వీర్రాజు గారూ, ముఖ్యమంత్రి ఎవరు అనేది తరువాత డిసైడ్ చేయవచ్చు, ముందు కొంచెం జ్ఞానోదయం పెంచుకోండి...