ఒక పక్క తెలంగాణాలో తెరాస పార్టీ ఆధిక్యంలో దూసుకువెళ్తుంటే, మరో పక్క మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి అంచున ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ ముందంజలో ఉంది. మిజోరం, తెలంగాణలో ఆ పార్టీ వెనుకంజలో ఉంది. మధ్యప్రదేశ్(230)లో 114 స్థానాల్లో కాంగ్రెస్, 101 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్(199)లో 102 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. భాజపా 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్‌గఢ్(90)లో 58 స్థానాల్లో కాంగ్రెస్, 23 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉన్నాయి.
ఇక తెలంగాణ(119) లో ఆ పార్టీ వెనుకంజలో ఉంది. తెరాస 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆ పార్టీ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మిజోరం(40)లోనూ కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఇక్కడ ఎంఎన్‌ఎఫ్ 25 స్థానాల్లో ఆధిక్యం ఉండగా కాంగ్రెస్ 8 స్థానల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.