ఆంధ్రోడు కొట్టిన దెబ్బకి,మొన్నే కర్ణాటకలో బీజేపీకి చుక్కలు కనిపించాయి... ఒక 10సీట్లు పోయి ఉంటాయి తక్కువలో తక్కువ... ఆ 10 సీట్లే తగ్గినయ్యి మెజారిటికి.... ఆ 10 సీట్ల లోటు పూడ్చుకోవటానికి బేరసారాలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు... దేశవ్యాప్తంగా పరువు పోయింది... బీజేపీ వేసుకున్న విలువలు అనే ముసుగు తొలిగిపోయింది.... ఒక్క ముక్కలో చెప్పాలంటే... రెండు నెలల్లో బీజేపీని గుడ్డలూడదీసి నడిరోడ్డు మీద నుంచో పెట్టాడు చంద్రబాబు నాయుడు... తెలుగువారికి అన్యాయం చేసిన బీజేపీని ఓడించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపు అక్కడి తెలుగువారందరినీ ఏకం చేసింది. తెలుగువారు ప్రభావం చూపగలిగిన స్థానాలు ఆ రాష్ట్రంలో సుమారు 50 ఉంటే.. అందులో 40 చోట్ల కాంగ్రెస్, జేడీఎ్‌సలే గెలిచాయి.
ఇప్పుడు మరో సారి, బీజేపీకి అదే కర్ణాటకలో తెలుగు వారు మన పవర్ చూపించారు.. కర్ణాటకలోని జయనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్+జేడీఎస్ హవా కొనసాగుతోంది. కర్ణాటకలోని జయనగర శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడింది. ఈ స్థానానికి జూన్ 11న ఉప ఎన్నిక జరగగా బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాగా.. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యరెడ్డి సమీప భాజపా అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్‌పై 2989 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల కోసం జయనగర నుంచి బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి బీఎన్ విజయకుమార్ మరణంతో అక్కడ ఎన్నిక రద్దయ్యింది.
దీంతో జూన్ 11న ఉప ఎన్నిక నిర్వహించారు. ఉప ఎన్నికలో భాజపా తరఫున విజయకుమార్ సోదరుడు బీఎన్ ప్రహ్లాద్.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి పోటీ చేశారు. వీరితో పాటు మరో 17మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. దీంతో తమ కూటమి పార్టీ అయిన కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు జయనగర ఉప ఎన్నికల్లో జేడీఎస్ పోటీ నుంచి విరమించుకుంది. బీజేపీకి పట్టు ఉన్న సీట్ కావటం, పైగా చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి పోటీ ఉండే సెంటిమెంట్, యడ్యురప్ప సియం సీటు వదులుకున్న సెంటిమెంట్, ఇవన్నీ చూసి, బీజేపీ తేలికగా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. అయితే, ఇది కూడా పోయింది. ఇక్కడ కూడా దాదాపు 25 శాతం మంది తెలుగు వారు ఉంటారు. వారి వల్లే, తక్కువ మెజారిటీతో ఓడిపోయామని బీజేపీ అంటుంది. మొత్తానికి మరో సారి ఆంధ్రోడి దెబ్బ, బీజేపీకి తగిలింది.