ఆంధ్రలను నమ్మక ద్రోహం చేసిన మోడీ-షా ల పతనం, నిజంగా మనకు దీపావళే. అలాగే దేశంలో వ్యవస్థలను అన్నీ నాశనం చేస్తున్న మోడీ వైఖరితో విసుగు చెందిన, దేశ ప్రజల అందరికీ ఇది దీపావళి. కాంగ్రెస్ గెలిచినందుకు కాదు, మోడీ-షా కు చావు దెబ్బ తగిలినందుకు, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇక విషయానికి వస్తే, కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేస్తోంది. కర్ణాటకలోని మూడు లోక్‌సభ స్థానాలకు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించారు. ఉపఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి వ్యూహం ముందు కాషాయపార్టీ కూలబడింది. అన్ని పార్టీలు ఏకం అయితే, మోడీ-షా రాజకీయానికి చావు దెబ్బే అని మరోసారి రుజువైంది.
మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు సహా ఐదు స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం ఖరారైంది. ఇక బీజేపీ కంచుకోట శివమొగ్గలో సైతం బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టబోయినట్టు తయారైంది. బీజేపీకి చాలా బలమైన ఈ స్థానంలో, ఈసారి ఆ పార్టీ ఇక్కడ స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమఖండి అసెంబ్లీ స్థానంతో పాటు బళ్లారి లోక్‌సభ స్థానంలో ఇప్పటికే కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. బళ్లారిలో లక్ష ఓట్లు, జమఖండిలో 40 వేల ఓట్ల మేర కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్లింది. మరోవైపు మాండ్య లోక్‌సభ స్థానంలోనూ, రామానగరం అసెంబ్లీ స్థానంలోనూ జేడీఎస్ భారీ ఆధిక్యంతో విజయం ఖాయం చేసుకుంది. రామానగరంలో ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి లక్షకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ సమీప భాజపా అభ్యర్థి సిద్ధరామయ్యపై భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. మరో లోక్‌సభ నియోజకవర్గం శివమొగ్గలో భాజపా అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్ అభ్యర్థి మధు బంగారప్ప పై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు .తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రతికూలవాద రాజకీయాలను ప్రజలు తిరస్కరించారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కాంగ్రెస్ నేత దినేశ్ గుండూరావు వ్యాఖ్యానించారు. మరోసారి తమకు భారీ విజయం కట్టబెట్టినందుకు కర్ణాటక ప్రజలకు మాజీ ప్రధాని, జేడీఎస్ చీప్ హెచ్‌డీ కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరీకరించేందుకు ప్రయత్నించేవారికి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆయన అన్నారు.