Sidebar

13
Tue, May

పెట్రోల్ ధరలపై యావత్ దేశం భగ్గుమంటోంది. విపక్షాలన్నీ ఏకమై భారత్ బంద్ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ఈ నిరసనలు మాత్రమే కాదు.. పెట్రోల్ ధరలపై సోషల్ మీడియాలోనూ పంచ్‌లు పేలుతున్నాయి. పెరిగిన ధరలపై సామాన్యులతో పాటూ విపక్ష పార్టీల నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. దీంతో, ఇది కవర్ చెయ్యటానికి, బీజేపీ రంగంలోకి దిగింది. తనకు బాగా వచ్చిన విద్య, సోషల్ మీడియాలో మాయ చెయ్యటం.. ఇదే ఆయుధంగా తీసుకుని, ప్రజలను పిచ్చోల్లని చెయ్యాలని, తనే నవ్వుల పాలు అయ్యింది. బీజేపీ ఆఫిషియల్ ట్విట్టర్ ఎకౌంటులో వేసిన పోస్ట్ చూస్తే, వీళ్ళ ప్రజలను ఎలా బకరాలాను చేస్తున్నారో అర్ధమవుతుంది.

bjp 11092018 2

జేపీ ప్రభుత్వంలోనే పెట్రో ధరలు ‘తగ్గుముఖం’ పట్టాయి.. కావాలంటే చూడండి” అంటూ బీజేపీ ఒక పోస్ట్ పెట్టింది.గత పధ్నాలుగేళ్లలో దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల ఈ విధంగా వుంది.. అంటూ వివరిస్తూ, మోడీ హయంలో మాత్రం తగ్గినట్టు చూపించింది. 2004 మే 16న ఢిల్లీలో రూ. 33 వున్న లీటర్ పెట్రోల్ రిటైల్ ధర.. ఐదేళ్ల తర్వాత అంటే.. 2009 మే 16న రూ. 40కి పెరిగింది. ఇది 20 శాతం పెరుగుదల. కానీ.. అదే 40 రూపాయల ధర ఆదే మన్మోహన్ సర్కార్లో మరో ఐదేళ్ల తర్వాత ఏకంగా 75 శాతం పెరిగి రూ. 71 లకు చేరింది. మోదీ అధికారంలోకొచ్చాక ఈ రూ. 71 ధర 80 రూపాయల 73 పైసలకు చేరింది. ఈ పెరుగుదల కేవలం 13 శాతం మాత్రమే. ఇప్పుడు చెప్పండి.. మోదీ హయాంలో పెట్రోల్ ధరల దూకుడుకు కళ్లెం పడిందా లేదా? అంటూ ప్రశ్నిస్తూ, ప్రజలను పిచ్చోళ్లని చేసింది.

bjp 11092018 3

అంతకు ముందు, పెట్రోల్ ధరలపై ప్రముఖ నటి, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రమ్య తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి టెస్టులో సాధించిన అత్యధిక స్కోరు కంటే పెట్రోల్ ధరలే ఎక్కువగా ఉన్నాయంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు. ఇంధన ధరలపై ప్రతిపక్ష పార్టీలు ఇవాళ భారత్ బంద్ చేపట్టిన నేపథ్యంలో ఆమె ట్విటర్లో స్పందిస్తూ... ‘‘86 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అత్యధిక స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే రూ.87కు దూసుకెళ్లిన పెట్రోల్ అంతకంటే టాప్‌లో కొనసాగుతోంది...’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read