బీజేపీ, తెలుగుదేశం మధ్య తెగదెంపులు ఫైనల్ కు వచ్చిన పరిస్థితుల్లో, రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయం నేపధ్యంలో, రాష్ట్రంలో బీజేపీకి మొదటి షాక్ తగిలింది... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ముందుగా హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పిన కొన్ని గంటల్లోనే ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీతో తెగదెంపులకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్తూరుకు చెందిన ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం సుబ్బయ్యను పార్టీలో చేర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో, మంత్రి అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. పట్నం సుబ్బయ్యతోపాటు జెడ్పీ మాజీ చైర్మన్ శ్రీనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. మరింత మంది బీజేపీ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో నాలుగేళ్ల స్నేహం తర్వాత బీజేపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. బిజెపితో పొత్తును టిడిపి తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోంది.కొందరు బిజెపి నేతలు టిడిపిలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా బిజెపికి నష్టమే..ఏపీ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇస్తానన్న హమీలతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి కూడ ఇదే అంశాలను ప్రస్తావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బిజెపి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది..