ఒక పక్క రేవంత్ ఇష్యూ జరుగుతూ ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉన్న వేళ, తెలంగాణా బీజేపీ ఎమ్మల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి... అయితే కాంగ్రెస్, లేకపోతే తెరాస అనే ఊపులో తెలంగాణా రాజకీయం ఉంది... తెలుగుదేశంలో ఉన్న రేవంత్, కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు అనే ప్రచారం ఉండటంతో, టిడిపి పార్టీ తెలంగాణాలో కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది. అయితే, తెలంగాణా బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ మాత్రం, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో పంచాయితీరాజ్ గ్రామీణ అభివృద్ది, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు, తెలంగాణా బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్. దైవ దర్శనం కోసం విజయవాడ వచ్చిన రాజా సింగ్, మిత్రుడు అయిన లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ, తాత్కాలికంగానే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని, అసెంబ్లీని అద్భుతంగా నిర్మించారని ఇది చంద్రబాబు పని తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబునాయడు నాయకత్వంలో తెలంగాణ మించి అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసి, తిరిగి తెలంగాణను కూడా ప్రగతిపథంలో పయనింప చేయడానికి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 2019 లేదా 2024లో తెలంగాణ రాప్రానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వమే శరణ్యమ,ని ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఎంతో ముందు చూపుతో ఆర్ధిక, పారిశ్రామిక, రాజధాని పరంగా పారిశ్రామిక రవాణా, ఐటీ వంటి అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి జరగనున్నదని తెలిపారు. చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త అని, రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో అనుభవం కలిగిన వారని పేర్కొన్నారు.