రోజు రోజుకీ మోడీ ప్రచారం ఎలా దిగాజారుతుందో చూస్తున్నాం. ఆ కోవలోనే, రాహుల్‌ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందంటూ కొత్త హడావిడి మొదలు పెట్టారు. అయితే ఇన్నాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా, ఈ విషయంలో ఏమి చెయ్యలేని మోడీ, ఇప్పుడు మాత్రం హడావిడి మొదలు పెట్టారు. దీంతో ఇది కోర్ట్ కు చేరింది. రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్న రాహుల్‌ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై నేడు విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్‌ విచారణకు అర్హం కాదని తోసిపుచ్చింది.

supreme 09052019

యూకేకు చెందిన ఓ కంపెనీ తమ వార్షిక డేటాలో రాహుల్‌ గాంధీని బ్రిటీష్‌ పౌరుడిగా పేర్కొందని, బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్న రాహుల్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హిందూ మహాసభ కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన ద్వంద్వ పౌరసత్వంపై విచారణ జరపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఏదో ఒక కంపెనీ ఏదో ఒక పత్రాల్లో ఆయన(రాహుల్‌ను ఉద్దేశిస్తూ) బ్రిటిష్‌ వ్యక్తి అని పేర్కొంటే ఆయన బ్రిటిష్‌ పౌరుడు అయిపోతారా..? ఈ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదు. దీన్ని మేం కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం వెల్లడించింది.

supreme 09052019

రాహుల్‌ పౌరసత్వంపై గతంలోనూ దుమారం రేగిన విషయం తెలిసిందే. రాహుల్‌ పౌరసత్వ స్థితిని ప్రశ్నిస్తూ భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్ర హోంశాఖకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాహుల్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. అంతకుముందు ఇదే విషయమై 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాహుల్‌ పౌరసత్వంపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అయితే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read