తృణమూల్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాల ఐక్య ర్యాలీ కోల్‌కతాలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ శత్రఘ్ను సిన్హా పాల్గున్నారు. మోడీ పై రెబల్ గా ఉన్న శత్రఘ్ను సిన్హా, ఈ సమావేశానికి హాజరుకారని బీజేపీ భావించింది. కాని ఆయన హాజరై, బీజేపీకి షాక్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రఫేల్ కుంభకోణంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి బీజేపీ రెబల్ ఎంపీ శత్రఘ్ను సిన్హా డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఎవరు బాగుపడ్డారో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. పేద, సమాన్య ప్రజలు పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. అంత ఇబ్బందులు పడినందుకు ఏమైనా మంచి జరిగిందా అంటే అదీ లేదన్నారు.

bjp 19012019

జీఎస్టీతో చిన్న వ్యాపారుల పరిస్థితి ఏమైందో మోడీకి తెలియదా అని నిలదీశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్టీని వ్యతిరేకించిన మోడీ... ఆయన ప్రధాని అయిన తర్వాత అమలు చేయటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అందుకే కేంద్రంలో కొత్త నాయకత్వం రావాలి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ " కాపలాదారే దోచుకున్నారు" అంటున్నారు అందుకు మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. అయితే ఈ ఊహించని పరిణామం నుంచి తేరుకున్న బీజేపీ, సొంత ఎంపీ పైనే ఎదురు దాడి మొదలు పెట్టింది. ఐక్యతా ర్యాలీకి భాజపా ఎంపీ శత్రుఘ్న సిన్హా హాజరుకావడంపై భాజపా నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

bjp 19012019

‘కొంతమంది తెలివి వేరే విధంగా ఉంటుంది. కొంతమంది భాజపా స్టాంప్‌తో అధికారంలోకి వచ్చి అన్ని సౌకర్యాలు పొందుతారు. అందుకే అలాంటి వాళ్లు తమ సభ్యత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అదే విధంగా వేదికలపైకి ఎక్కి సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశవాదుల్లాగా మారతారు. భాజపా వారిని పరిగణనలోకి తీసుకుంటుంది’ అని రూడీ.. సిన్హాను హెచ్చరించారు. మోదీకి వ్యతిరేకంగా చేపట్టారని, దాని వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. ‘నరేంద్రమోదీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ప్రజలు చూశారు. రానున్న ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read