నరేంద్ర మోడీ ప్రభుత్వం, అవిశ్వాస నోటీసు చర్చకు రాకుండా, ఎందుకు పారిపోతుందో, ఇప్పుడు తెలుస్తుంది... సొంత పార్టీ ఎంపీలే బహిరంగంగా మోడీ పై తిరుగుతుబాటు ప్రకటిస్తున్నారు... బహిరంగంగానే ఇలా ఉంటే, ఇంకా సమయం కోసం ఎదురు చూస్తున్న వారు ఇంకా ఎంత మంది ఉన్నారో, అందుకే మోడీ ప్రభుత్వం, అవిశ్వాసం నుంచి పారిపోతుంది... ఈ రోజు, బీజేపీయేతర ఫ్రంట్ కోసం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, బీజేపీ ఎంపీలే వెళ్లి కలిసారంటే, మోడీ పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉందో తెలుస్తుంది.. ఇదే టైంలో, మరో ఎంపీ కూడా తిరుగుబాటు ప్రకటించారు...

modi 28032018

పార్లమెంటులోని పార్టీ కార్యాలయంలో ఉంటూ వివిధ పార్టీల ఎంపీలను మమత కలుసుకుంటున్నారు. బీజేపీలో ఉంటూనే ఆ పార్టీ విమర్శకులుగా పేరున్న శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హాలను మమత ఇవాళ కలుసుకున్నారు. మహాకూటమిని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే అంశంపై, మమతా ఇప్పటికే చొరవ తీసుకున్న సంగతి తెలిసిందే... ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత గోపాల్ యాదవ్, డీఎంకే నేత కనిమొళి, శివసేన ఎంపీలను మంగళవారంనాడే మమతా బెనర్జీ కలుసుకున్నారు... అయితే బీజీపీ ఎంపీలు కూడా మోడీ పట్ల వ్యతిరేకత చూపిస్తూ, మమతను కలవటం ఆసక్తిగా మారింది..

modi 28032018

ఇది ఇలా ఉండగా, యూపీకి చెందిన బీజేపీ దళిత ఎంపీ సావిత్రిబాయి పూలె సొంత పార్టీపైనే తిరుగుబాటు చేశారు. మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని... బడుగు, బలహీనవర్గాలకు ప్రస్తుతం అందిస్తున్న రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా... ఏప్రిల్ 1వ తేదీన లక్నోలో తాను ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇలా ప్రధాని మోడీ పై సొంత పార్టీ నేతలే అవిశ్వాసం ప్రకటిస్తుంటే, ఇంకా విపక్షాల సంగతి చెప్పేది ఏముంది. అందుకే వీరు చర్చకు భయపడుతూ, వాయిదా వేసుకుని వెళ్ళిపోతున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read