కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని గగ్గోలు పెడుతుంటే, బీజేపీ రెండు రోజులు నుంచి కొన్ని లెక్కలు చెప్తుంది... బీజేపీ ఎంపీ హరిబాబు గారు అయితే, అన్నీ ఇచ్చేసాం అని తేల్చేసారు... 27 పేజీల రిపోర్ట్ ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం అంటూ చెప్పుకొచ్చారు.. అందులో మనకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమి లేదు.. అన్ని రాష్ట్రాలకు ఎలా ఇస్తున్నారో, మనకి అలాగే ఇచ్చారు... అదేదో ప్రత్యేకంగా నవ్యాంధ్రకే ఇచ్చినట్లు చెబుతున్నారు... కేంద్రంలో బీజేపీ రాష్ట్రానికి సాయం చేయకుండా, జాప్యం చేసేందుకు జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఎత్తులు వేస్తుండగా.. రాష్ట్రస్థాయిలో బీజేపీ గాల్లో లెక్కలు వేసి, లక్ష కోట్లు ఇచ్చాం అని చెప్తుంది...

bjp 12022018 2

ఇన్ని చెప్పిన బీజేపీ ఐదు అంశాల పై మాత్రం ఎక్కడా స్పష్టత ఇవ్వటం లేదు... అమరావతి, పోలవరం, రెవెన్యూలోటు, ప్రత్యేక ప్యాకేజీ, రైల్వేజోన్‌పై బీజేపీ నేతలు మాట్లాడడం లేదు... అమరావతి నిర్మాణానికి రూ.1.3 లక్షల కోట్లు అవుతుందని అంచనా. అందులో రూ.48 వేల కోట్లు అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్‌ తదితరాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు ఖర్చవుతుంది. ఇందులో ఇప్పటివరకు రూ.2,500 కోట్లు ఇచ్చామంటున్నారు. ఇంకో రూ.1000 కోట్లే ఇస్తామంటున్నారు. గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికే రూ.1000 కోట్లయితే.. రాజధానికి కేంద్రం ఇచ్చేది రూ.3,500 కోట్లేనా?

bjp 12022018 3

పోలవరం జాతీయ ప్రాజెక్టు.. మేమే పూర్తి చేస్తామన్నారు. భూసేకరణ, పునరావాసానికి రూ.33 వేల కోట్లు ఇస్తామని ఇవ్వలేదు. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చూ వెనక్కివ్వలేదు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. రామాయపట్నంలో పోర్టు పెట్టాలని ఎప్పుడో రాష్ట్రం చెప్పింది... అయినా ఏం చేశారు... కడప ఉక్కు కర్మాగారం సాధ్యం కాదన్న నివేదిక ఎప్పుడొచ్చింది ? ఇప్పుడే వచ్చిందా? ఏళ్లతరబడి ఆలోచిస్తూనే ఉంటారా ? ఇక రైల్వే జోన్‌ విషయంలో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు... ఇదిగో ఇచ్చేస్తున్నాం అంటూ లీక్లు ఇస్తున్నారు... బుందేల్‌ఖండ్‌కు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద రూ.6 వేల కోట్లు ఇచ్చారు... ఏపీలోని ఏడు జిల్లాలకు మూడేళ్ల కాలానికి రూ.1050 కోట్లే ఇచ్చారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read