బీజేపీ మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆటలు ఆడుతోంది. అమరావతిపైనా దాగుడుమూతలు కొనసాగిస్తోన్న కేంద్ర బీజేపీ పెద్దల బాటనే రాష్ట్ర బీజేపీ నేతలు పయనిస్తున్నారు. ఒక రోజు అమరావతే రాజధాని అంటారు. మరో రోజు జిల్లాకొక రాజధాని పెట్టుకోవచ్చని అదే నోటితో వ్యాఖ్యానిస్తారు. తాజాగా అమరావతిని రాజధానిగా 2015లోనే నోటిఫై చేశారని కేంద్రం అఫిడవిట్ వేసింది. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనకే సాధ్యమైన కామెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు హయాంలోనే ప్రత్యేక హోదా ఇచ్చేశామంటున్నాడు. పార్లమెంట్ సాక్షిగా రూ.15 వేల కోట్లు ఇచ్చామని సింపుల్ గా చెప్పేశాడు. రాష్ట్రానికి చెందిన మరో బీజేపీ నేత సత్య కుమార్ మాట్లాడుతూ అమరావతిపై తీర్మానం చేసిన వైసీపీ ఇప్పుడు మాట ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఆగదని ప్రకటించిన బీజేపీ పెద్దలే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తక్షణ ఆర్థిక సాయం కోరుతూ.. కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని కలిశారు. చేసే పనులు, ఆడే మాటలకు ఎక్కడా పొంతన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బీజేపీ ఆటలు ఆడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌తో ఆటలు ఆడుతోన్న బీజేపీ.. ఏపి ప్రజలంటే లెక్క లేదా ?
Advertisements