ఓవైపు ప్రధాని స్వచ్ఛ భారత్ అంటూ, ఒక ఉద్యమంలా చేస్తుంటే, మరోవైపు బీజేపీ నేతలు మాత్రం, కంపు పనులు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జనలు చేయరాదంటూ, మోడీ ప్రచారం చేస్తుంటే, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం అలాంటివేం పట్టించుకోవడం లేదు. రాజస్థాన్ బీజేపీ నాయకుడు, మంత్రి అయిన శంభూ సింగ్ ఖేటసర్ బహిరంగ మూత్ర విసర్జన చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. దీంతో నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్‌మేర్‌లో పర్యటించారు మంత్రి శంభూసింగ్, ఈనేపథ్యంలో ఓ గోడ వద్ద ఆయన మూత్ర విసర్జన చేశారు.

bjp 08102018 2

ఆ గోడపై బీజేపీ పోస్టర్ కూడా ఉంది. ఆ పోస్టర్ లో రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుందరా రాజే కూడా ఉన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లంతా తనపై ట్రోల్ చేస్తుండటంతో దీనిపై స్పందించారు మంత్రి. ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం తప్పుకాదన్నారు. అయితే అది నిర్మానుష్యప్రాంతమ ఉండాలన్నారు మంత్రి. తాను మూత్ర విసర్జన చేసింది నిర్మానుష్య ప్రాంతంలో అంటూ చెప్పుకొచ్చారు.

bjp 08102018 3

అలాంటి ప్రాంతంలో ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు వ్యాపించవన్నారు. ఈ వివరణపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతమైతే అక్కడ బీజేపీ పోస్టర్ ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి సొంత పార్టీ నేతలలే చెడ్డ పేరు తెస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద మోడీ స్వచ్ఛ భారత్ మిషన్‌కు సొంత పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బీజేపీ నేతలు ఫోటోలు కోసం ఫోజులు ఇస్తూ, రోడ్డు మీద చెత్త వేసి, ఆ చెత్త ఊడవటం లాంటివి చూసాం, ఈ సంఘటన మాత్రం హైలైట్..

Advertisements

Advertisements

Latest Articles

Most Read