తిరుపతిలో వెంకన్న పాదాల చెంత, నాలుగేళ్ళ క్రిందట, సరిగ్గా ఇదే తేదిన నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్ధిగా వచ్చి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు... వాటిని నెరవేర్చకుండా మోసగించారని మండిపడుతున్న చంద్రబాబు నాయుడు, అదే ఏప్రిల్‌ 30న అదే ప్రాంగణం నుంచి మోదీ మోసాన్ని జనానికి తెలియజెప్పే విధంగా సభ నిర్వహిస్తున్నారు... ఎన్నికలకు ఏడాది సమయమేఉండటం, తిరుపతి నుంచే తెదేపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సంప్రదాయం కలిగి ఉండటాన్ని బట్టి ఇది ఎన్నికల ప్రచారానికి నాందిగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు...

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. తెదేపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో కేంద్రంపై పోరాటానికి తిరుపతినే వేదికగా ఎంచుకున్నారని అవగతమవుతోంది. ఈ సభ తర్వాత రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ సభలు నిర్వహించే యోచనలో పార్టీ ఉందని సమాచారం. ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా మోదీ ప్రసంగ పాఠాన్ని ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించనున్నారు. అందులో మోదీ పేర్కొన్న ప్రతి అంశాన్నీ ప్రస్తావిస్తూ నాడు ఏమి హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎలా వాగ్దాన భంగానికి పాల్పడ్డారో.. వివరించనున్నారు. తెలుగు ప్రజల ఇలవేల్పు సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఇచ్చిన హామీని ఏ విధంగా విస్మరించారనేది వివరించనున్నారు...

అయితే, ఈ సభ జరగకుండా ఉండటానికి, కేంద్రం ఇప్పటికే గవర్నర్ ను, ఐబి చీఫ్ ను చంద్రబాబు వద్దకు పంపించింది... చంద్రబాబు ఇక్కడ మీటింగ్ పెట్టి విమర్శలు చేస్తే, కర్నాటక ఎన్నికల పై ప్రభావం పడుతుందని, ఇప్పుడిప్పుడే అక్కడ బీజేపీ పరిస్థితి మెరుగు పడుతుంది అని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.. అయితే, ఇవన్నీ చంద్రబాబు పట్టించుకోలేదు.. మరింత విమర్శల దాడి పెంచారు.. అయితే, ఈ సభ అనివార్యం అని తెలుసుకున్న బీజేపీ పెద్దలు, మమ్మల్ని ఎన్ని విమర్శలు అయినా చేసుకోండి, కాని కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా వోట్ వెయ్యమని పిలుపు ఇవ్వద్దు అని, అది ఎన్నికల పై, అక్కడ తెలుగు వారి ప్రభావం చూపిస్తుందని, చంద్రబాబుకి వర్తమానం పంపించారు... అయితే, చంద్రబాబు మాత్రం, ప్రజలకు ఏది కావాలో, నేను అదే మాట్లడతా అని, తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read