దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ఆపరేషన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తర భారతం అంతటా బీజేపీ విస్తరించింది. ఈశాన్య భరతం, పశ్చిమ, మధ్య భారతంలో కూడా బీజేపీ పార్టీ నిలిచింది. ఇక మిగిలింది దక్షిణ భారతం. ఇందులో కర్ణాటక మినహా, బీజేపీకి ఎక్కడా బలం లేదు. తెలంగాణాలో కొద్దిగా ఉంది. అయితే వీటిని చూపిస్తూ, మేము మీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటూ, ప్రచారం మొదలు పెట్టారు. ఆ నాయకుడు వస్తున్నాడు, ఈ నాయకుడు వస్తున్నాడు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా, తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను లాక్కుని, అప్పటి నుంచి నేతల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చెప్పుకోతగ్గ నేత ఎవరూ బీజేపీ పార్టీలో చేరలేదు.

bjp 199072019 1

అయినా సరే, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మాత్రం హడావిడి ఆపలేదు. ఇప్పుడు గవర్నర్ ని మార్చటం, ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతను గవర్నర్ గా వెయ్యటంతో, బీజేపీ తన లక్ష్యం ఏంటో చెప్పకనే చెప్పింది. అయితే మొన్నటి దాక తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నాం, వారిని మూసేస్తున్నాం, చంద్రబాబు విదేశాల నుంచి వచ్చే లోపు, పార్టీ అయిపోతుంది అని ప్రకటించిన బీజేపీ నేతలు, లంకా దినకర్ లాంటి స్పోకస్ పర్సన్ ని మాత్రమే తీసుకోగలిగారు. దీంతో తెలుగుదేశం పార్టీ పేరు రోజు చెప్తే ప్రజలు నమ్మటం లేదు అనుకున్నారో ఏమో, ఇప్పుడు రూటు మార్చి కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్తున్నారు. వీరు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కాని, బీజేపీ హడావడి మాత్రం మాములుగా లేదు.

bjp 199072019 1

ఈ రోజు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, బాంబు పేల్చారు. ఎవరూ ఊహించని వ్యక్తితో బీజేపీ టచ్ లో ఉందని, అయానే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అని చెప్పారు. అంతే కాదు, మొన్నటి దాక, ప్రస్తుతం మంత్రులగా ఉన్న, బొత్స సత్యనారాయణ, ధర్మాన కూడా మాతో టచ్ లో ఉన్నారని మధావ్ అన్నారు. ఆగష్టు తరువాత ఏపి రాజకీయాలు మొత్తం మారిపోతాయని అన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, కాకపోతే పార్టీ మారగానే అనర్హత వేటు వేస్తాం అని జగన్ చెప్పటంతో, వారిని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాం అని అన్నారు. మొత్తానికి అన్ని పార్టీల నేటు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమా పార్టీలో చేరిపోతున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇంతకీ మొన్న ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పోటీ పడిందో తెలుసా ?నోటా తో పోటీ పడ్డారు. చివరకు కాంగ్రెస్ కు కూడా నోటా కంటే ఎక్కువ ఓట్లు వస్తే, నోటా కంటే తక్కువ ఓట్లతో బీజేపీ ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read