రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీ, కొత్త కొత్త వ్యూహాలతో రాష్ట్రం పై విరుచుకుపడుతున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వెతుకులాడిన బీజేపీ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కింగ్‌మేకర్ కావాలని భావిస్తోంది. బీజేపీ, ఎన్డీయేతో టీపీపీ తెగతెంపులు చేసుకున్న తరువాత రాష్టానికి కొత్త అధ్యక్షునిగా వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర పెద్దల ఆదేశాలను, అమిత్‌షా రాజకీయాన్ని యథాతథంగా ఇక్కడ అమలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏమాత్రం పట్టులేని బీజేపీ, 2019లో కాషాయ జెండా రెపరెపలను చూడాలని అధిష్ఠానం ఆశిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీ, రెండు ఎంపీ సీట్లను, నాలుగు అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న సంకేతాలు బీజేపీ శ్రేణులకు అందాయి.

bjp 17072018 2

దీంతో ఏపీలో 25 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వీటిలో 10కి పైగా అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల విషయంలో ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని పార్టీ అగ్రనేతలు తెలియచేశారు. పార్టీ ఇప్పటికే ఎంపిక చేసుకున్న 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి పార్టీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోబోతోంది. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడంతోపాటు, కేంద్రం నుంచి అదనంగా నిధులు తెప్పించుకుని, అక్కడ బలీయమైన శక్తిగా ఎదగాలన్న ఆలోచనలో ఉంది.

bjp 17072018 3

నెలకు ఒక కేంద్ర మంత్రిని ఏపీకి తీసుకువచ్చి, ఆయా శాఖల ద్వారా ఏపీకి ఇచ్చిన నిధుల గురించి వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, నడ్డా ఏపీలో పర్యటించి వెళ్లారు. త్వరలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాష్ట్రానికి రాబోతున్నారని పార్టీ వర్గాలు తెలియచేశాయి. అంతేకాదు, వచ్చే నెలలో బీజేపీ చీఫ్ అమిత్‌షా ఏపీకి వస్తున్నట్టు బీజేపీ నాయకులు తెలియచేశారు. అమిత్‌షా ఏపీ పర్యటన తరువాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని వారు తెలియచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read