పట్టుమని నియోజకవర్గానికి 100 ఓట్లు కూడా రాని బీజేపీ, ఆంధ్రప్రదేశ్ కు వార్నింగ్ లు ఇస్తుంది... కర్ణాటక ఎన్నికలు పూర్తయిన వెంటనే, మీ అంతు చూస్తానికి వస్తున్నాం, కాచుకోండి అంటూ, సవాల్ చేస్తుంది... మమ్మల్ని ఇంత అవమానాల పాలు చేసి, దేశంలో మా పరువు తీసిన, చంద్రబాబుని వదిలిపెట్టే సమస్యే లేదు అంటూ, ఎగురుతున్నారు బీజేపీ పెద్దలు... కర్ణాటక మేము గెలుస్తున్నాం, తరువాత మా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే, ఇక్కడ పాగా వేసి, మా సత్తా ఏంటో చూపిస్తాం అంటూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారు... కనీసం కాండిడేట్ లు కూడా దొరకని బీజేపీకి ఇంత ధైర్యం రావటానికి కారణం, పవన్, జగన్... వెళ్ళఇద్దరితో ఏపిలో గేమ్ ఆడబోతున్నారు...
నిన్న బీజేపీ నేత మురళీధర్‌రావు, ఒక మీడియా ఛానల్ తో మాట్లాడిన మాటలు కూడా ఇలాగే ఉన్నాయి... 2 నెలల్లో ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు... అంటే, ఎదో భారీ ప్రణాళికతోనే రాబోతున్నారు... చంద్రబాబు చూపిస్తున్న దూకుడు ఊహించిన బీజేపీ పెద్దలు ప్రస్తుతానికి వెనక్కు తగ్గారు కాని, లేకపోతే ఈ పాటికే ఆపరేషన్ గరుడ పూర్తయ్యేది... చంద్రబాబు ఎదురు తిరగటం, వీళ్ళ నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా ఎండగట్టటంతో, మోడీ, అమిత్ షా పరువు గంగలో కలిసింది.. కనీసం, పార్లమెంట్ కూడా నిర్వచించలేక, దద్దమ్మల్లా పారిపోయారు అంటూ, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే, అవి కవర్ చెయ్యటానికి, ఈ రోజు దీక్ష అంటూ కొత్త ఎత్తుగడ వేసారు...
మరి, ఇంత ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుని ఎదుర్కోవటానికి, వాళ్ళకి రెండే దారులు... ఒకటి, చంద్రబాబు పై కేసులు మోపి, లోపల వేయించటం... కాని, ఇది కుదరటం లేదు... కేంద్రంలోని అధికారులు, స్వయంగా పియంఓ అధికారులు రంగంలోకి దిగినా, ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చంద్రబాబు పై దొరకటం లేదు... చివరకి లోకేష్ పై కూడా కేసులు కోసం ప్రయత్నిస్తున్నా, ఎక్కడా అవకాసం చిక్కటం లేదు.. అందుకే రెండో ప్లాన్ రెడీ చేస్తున్నారు... అదే కుల గొడవలు... ఆంధ్రప్రదేశ్ లో కుల గొడవలు రేపటం ఒక్కటే మార్గం అని డిసైడ్ అయ్యారు... ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కడా చంద్రబాబు పై వ్యతిరేకత లేదు.. అందుకే కుల గొడవలు రేపటానికి రెడీ అయ్యారు... ఇందు కోసం పవన్, జగన్ ని వాడుకునే ప్లాన్ వేస్తున్నారు... రాష్ట్రంలో ఇక మనం చుదబోయిది ఇదే.. కాని, ప్రజలు అంత పిచ్చోళ్ళా ? 2014లోనే అభివృద్ధి వైపు వోట్ వేసారు ప్రజలు... ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, కులం గురించి పట్టించుకునే వారు ఉన్నారు అనుకోవటం, బీజేపీ అవివేవకం తప్ప, ఏమి లేదు...