బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌స్ట్రైక్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు సహాయపడుతోందని యెడ్యూరప్ప వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ దేశంలోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన చేసిన దాడుల వల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా మారిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎయిర్‌స్ట్రైక్ వల్ల 22 లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుంటుందని యెడ్యూరప్ప జోస్యం చెప్పారు. పాకిస్థాన్ పై భారత వాయుసేన దాడితో యువత సంతోషంగా ఉన్నారని, వారంతా నరేంద్రమోదీవైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో 28 లోక్ సభ స్థానాలుండగా ప్రస్థుతం బీజేపీ సభ్యులు 16 మంది ఉన్నారు. కాంగ్రెస్ 10, జనతాదళ్ కు ఇద్దరు సభ్యులున్నారు. ఎయిర్‌స్ట్రైక్ వల్ల బీజేపీకి 22 సీట్లు వస్తాయని యెడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.

modi 28022019 1

మరో పక్క, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ దళాల నిర్బంధంలో ఉన్న పైలట్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని దేశమంతా ప్రార్థిస్తుంటే.. ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలతో ‘‘రికార్డ్ బ్రేకింగ్’’ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడంపై మండిపడ్డాయి. దేశ వ్యాప్తంగా 15 వేల ప్రదేశాల్లోని కోటి మంది బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్... ప్రపంచంలోని అతిపెద్దదని బీజేపీ చెబుతోంది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేపట్టిన ‘‘మేరా బూత్ సబ్ సే మజ్‌బూత్’’ కార్యక్రమంలో భాగంగా ఈ కాన్ఫరెన్స్ జరిగింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విటర్‌లో స్పందిస్తూ...

modi 28022019 1

‘‘తప్పుడు ప్రాధాన్యతలకు స్పష్టమైన నిదర్శనమిది..! భారత సాహస వింగ్ కమాండర్ అభినందన్ వెంటనే, క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ 132 కోట్ల మంది భారతీయులు ప్రార్ధనలు చేస్తుంటే... మోదీ ధ్యాసంతా కేవలం మళ్లీ అధికారంలోకి రావడంపైనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరగాల్సిన ముఖ్యమైన సీడబ్ల్యూసీ సమావేశాన్ని, ర్యాలీని రద్దు చేసుకుంది. ప్రధాన సేవకుడు మాత్రం ఓ వీడియో కాన్ఫరెన్స్‌ను సృష్టించే పనిలో మునిగిపోయారు. రికార్డే..!’’ అని ఎద్దేవా చేశారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమాద్మీ చీఫ్ కేజ్రీవాల్ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘ప్రధానమంత్రి తన ‘మేరా బూత్ సబ్ సే మజ్‌బూత్’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను. ఈ సమయంలో ఒక దేశంగా మనం ఐఏఎఫ్ పైలట్‌ను క్షేమంగా వెనక్కి తీసుకు రావడానికి, పాకిస్తాన్‌తో కఠినంగా వ్యవహరించడానికి మన శక్తినంతా ఉపయోగించాల్సిన అవసరం ఉంది...’’ అని పేర్కొన్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read