ఏపీ క‌మ‌లంలో క‌ల‌హాలు తీవ్రం అయ్యాయి. బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తీరుతో పార్టీలో అసంతృప్తి జ్వాల‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. కొంద‌రు రాజీనామా చేయ‌గా. మ‌రికొంద‌రు ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి సోమువీర్రాజుపై ఫిర్యాదు చేశారు. బీజేపీలో తీవ్ర‌మైన కుమ్ములాట‌ల ప‌రిశీల‌న‌కు బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల ఇన్చార్జి, కేంద్ర‌మంత్రి ముర‌ళీధ‌ర‌న్ వ‌చ్చారు. ఆయ‌న రాజ‌మండ్రిలో దిగి పార్టీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. అయితే పార్టీ వ్య‌వ‌హారాల ఇన్చార్జి రాష్ట్రంలోకి వ‌చ్చి రాజ‌మండ్రిలో ఉంటే ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్వాగ‌తం ప‌ల‌క‌డం లేదు స‌రిక‌దా, రాజ‌మండ్రిలో లేకుండా క‌డ‌ప వెళ్లిపోయారు. సోము వీర్రాజుని అధిష్టానం త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని, ఈ లోగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కి వ‌చ్చిన ఫండ్ లాగేసుకునే ప‌నిలో వున్నార‌ని అస‌మ్మ‌తి నేత‌లు ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు సీనియ‌ర్ నేత‌ దారా సాంబయ్య వీర్రాజు వైఖ‌రిపై ముర‌ళీధ‌ర‌న్‌కి ఫిర్యాదు చేశారు. రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన స‌మావేశంలోనూ అన్నిస్థాయిల నేత‌ల నుంచి సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ముర‌ళీధ‌ర‌న్ అవాక్క‌య్యార‌ని స‌మాచారం. ముర‌ళీధ‌ర‌న్ ఉన్నంత‌వ‌ర‌కూ మ‌ళ్లీ వీర్రాజు రాజ‌మండ్రి వైపు క‌న్నెత్తి చూడ‌ర‌ని, ఆయ‌న ఢిల్లీ వెళ్లాకే వ‌స్తార‌ని బీజేపీలో చ‌ర్చ సాగుతోంది. వైసీపీ ఎంత మ‌ద్ద‌తు ఇస్తున్నా, బీజేపీలో ఓ ఒక్క‌రు కూడా సోము నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించ‌డంలేదు. ఇప్ప‌టికే చాలా మంది రాజీనామాలు చేశారు. సోము వీర్రాజునే కొన‌సాగిస్తామ‌ని బీజేపీ పెద్దలు తేల్చేస్తే, మిగిలిన నేత‌లు కూడా రాజీనామా బాట ప‌డ‌తార‌ని తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read