గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ ఆంధ్రా వాడి ఆక్రోశాన్ని పార్లమెంట్ వేదికగా దేశానికి వినిపించి, మాకు ఇంత అన్యాయం చేస్తావా, సమాధానం చెప్పండి ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’అంటే, రాష్ట్ర బీజేపీ నాయకులకి బాగా కాలినట్టు ఉంది... మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సంబోధించి ఘన కార్యం సాధించినట్టు భావిస్తున్నారు! జాగ్రత్తగా మాట్లాడండి అంటూ బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్‌రాజు గారు అంటున్నారు.. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అని మీరు సంబోధించినా 'మిస్టర్ చీఫ్ మినిస్టర్ 'అనే కుసంస్కారం మాకు లేదు అంటున్నారు రాజు గారు...
అయినా రాజు గారు, ‘మిస్టర్' అనేది గౌరవ వాచకం గౌరవ శాసనశాసన సభ్యుల వారికి ఇది తెలియదా... ప్రధానమంత్రిని ఆ రేంజ్ లో నిలదీయటం సహించలేక, జయదేవ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం లేక, 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ' అని తప్పుగా సంబోధించాడు అనే పసలేని పాయింట్ లేవదీశారు ..'మిస్టర్ ప్రెసిడెంట్', 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్' అని అడ్రెస్ చేయటంలో ఏ మాత్రం తప్పులేదు. అది చాలా మర్యాదతో కూడిన సంబోధన.. అమెరికాలో మిస్టర్ ప్రెసిడెంట్ అంటారు... బ్రిటన్ పార్లమెంట్ లో 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్' అంటారు..
బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినప్పుడు రామలింగరాజు కూడా క్లింటన్ ని 'మిస్టర్ ప్రెసిడెంట్..' అనే సంబోధించాడు..రామలింగరాజు , జయదేవ్ ఇద్దరూ అమెరికాలో చదువుకున్నారు.. అక్కడ అలా అడ్రెస్ చేయటం చాలా సహజం , స్టాండర్డ్ వే అఫ్ అడ్రెసింగ్ అనమాట ...ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు, మాట ఎందుకు తప్పారు , మా ఆంధ్ర ప్రజల మొహాన మట్టి ఎందుకు కొట్టారు అని గట్టిగా నిలదీయటం వలన ఉక్రోషం పట్టలేక 'అలా పిలిచాడు' ఇలా పిలిచాడు' అంటన్నారు.. భావదారిద్ర్యం అనమాట...