తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనికి సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 30వ తేదీవరకు జరగనుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 24వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. 3 నెలలకు ముందునుంచే బీజేపీ నాయకులు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో ముందు న్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని టిడిపి అన్ని పార్టీ లకన్నా ముందే చంద్రబాబు ప్రకటించారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా అభ్యర్ధి లేకుండా, ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేయగలం, ఇది మన బలహీనతను సూచిస్తుందని, అటు బీజేపీ, ఇటు జనసేన క్యాడర్ వాపోతున్నారు. ఇక వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని ఇటీవల ప్రకటించారు. సీపీఎం అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన యాదగిరిని ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికలో మొదట జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు భావించాయి. అయితే బీజేపీ పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తాడని ప్రకటించారు. అయితే తిరుపతిలో నెల రోజులుగా బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు నిర్వహిస్తున్న పలు సమావేశాలకు స్థానికంగా ఉన్న జనసేన నాయకులను ఆహ్వానించక పోవడంపట్ల ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే జనసేన పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడాన్ని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ తీవ్రంగా ఖండించారు.

somu 230320211 2

తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వైఎస్సార్‌ సీపీ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులను, ఏడుగురు ఎమ్మెల్యేలతో పర్యవేక్షణ కమిటీని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నియమించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎన్నికల నిర్వహణ కమిటీని నియమించారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. బీజేపీ మాత్రం జాతీయ నాయకులతో పాటు 20 మందికి పైగా రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర పార్టీ నేతలతో కలిసి ఎన్నికల పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి మండలానికి రాజ్యసభ సభ్యుడితో పాటు రాష్ట్ర నాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. ఎప్పటికప్పుడు పార్టీ స్థితిగతులను పార్టీ ముఖ్యులకు తెలియజేయాల్సివుంది. తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తిని గెలిపించుకుంటామని ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురుమూర్తి ఇప్పటికే జిల్లాలోని ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలుస్తూ వస్తున్నారు. పార్టీ నాయకులను కలసి తన గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, బీజేపీ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష టిడిపి, బిజెపి పార్టీల అధినాయకత్వం తిరుపతిలో మకాం వేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బిజెపి బూతాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందో అని పార్టీల నేతలు, నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read