ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు గమనించారా ? మోడీ-షా స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూడండి. నిన్న కాక మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు గుర్తు తెచ్చుకుని, వీళ్ళ ఎత్తుగడలు ఎలా ఉంటాయో గమనించండి. ప్రతి ఎన్నికలలో మోడి హవా ఉంది అని మీడియా తెగ గోల చేస్తుంది, దాని లో నిజం ఏమిటో తెలుసుకుందాం. అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇదే జరిగింది. కచ్చితంగా ఎన్నికల రేను, నెలలు ముందు బిజెపి వాళ్ళు RSS సర్వే ఒకటి విడుదల చేస్తారు. ఆ సర్వేలో బిజెపి ఓడిపోతుంది అని బిజెపి 50 - 60 ఎమ్మల్యేలను కూడా గెలవదు అని ఉంటుంది. ఆ తరువాత అసలు ఆట మొదలెడతారు బిజెపి వాళ్ళు. 50000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దిగుతారు. ఎన్నికల జరుగుతున్న రాష్ట్రానికి , రోజూ గుళ్ళ ముందు ప్రచారం మొదలెడతారు. హిందూ ఓటర్లను రెచ్చగొడతారు. ఆ తరువుత అమిత్ షా తో పాటు బిజెపి నాయకులు అంతా ప్రచారంలో కి దిగుతారు. అప్పుడు మీడియాని, నయానో భయానో భయపెట్టి, లాలించి బిజెపి బలం విపరీతంగా పెరిగింది, గట్టి పోటి ఇచ్చే స్థాయికి వచ్చింది అని వార్త ఛానల్ లో ఊదర కొడతారు. 

modishah 29072018 2

ఇక చివరిగా 15 రొజులు ముందు మోడి రంగంలోకి దిగుతాడు. ఇంకా ఏమి ఉంది సుడిగాలి పర్యటనలు రహుల్ గాంధీని కసి తీరా తిట్టటం, నోటికి వచ్చిన అబద్ధాలు ఆడటం, నేను పేదవాడిని, నన్ను చంపేస్తారు అని చెప్పటంతో చివర ఘట్టానికి ప్రచారం వస్తుంది. అప్పుడు మళ్ళీ మీడియాని దింపుతారు. మోడి హవా విపరీతంగా పెరిగిపోయంది, గెలుపు బిజెపిది అని ఊదరగొట్టటం మొదలెడతారు. అసలు కధ, ఇప్పుడే ఉంది. ఎందుకు అంటే ఎక్కడ అయిన తటస్థ ఓటర్లు 30 % మంది వుంటారు, వాళ్ళు 15 రొజులు మందు కాని వార్తలు చూడరు. ఆ 15 రొజులులో వార్తలు చూసిన తటస్థ ఓటర్లు బిజెపి గెలుస్తుంది కాబట్టి, బిజెపి కి ఓట్ల గుద్దేస్తారు. ఇంకా పోల్ మానేజ్మెంట్ గురించి మీకు తెలియంది కాదు. తటస్థ ఓట్లు సహయం తో బిజెపి గెలుస్తుంది. ఇంకా మీడియా హడావిడి మీడియాదే. ఇదే మోడి హవా. చివరగా మోడి హవా విపరీతంగా ఉంది అనే మాటకు సార్ధకత లభిస్తుంది. కర్ణాటకలో జరిగింది కూడా ఇదే. మోడీ సభలకు ఖాలీ కుర్చీలు అని మొదట్లో చూపించారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, మోడీ హవా అని మొదలు పెట్టారు.

modishah 29072018 3

రేపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారు. కాకపొతే, ఇక్కడ సీన్ లో పవన్-జగన్ ఉంటారు. ముందుగా చంద్రబాబు స్వీప్ అంటూ సర్వేలు వేస్తారు. తరువాత పవన్-జగన్ ని కలుపుతారు. తరువాత మోడి వచ్చి కొంత డబ్బు, కొన్ని హామీలు ఇవ్వటం మనం కళ్లు మూసి తెరిచే లోపులో జరిగిపోద్ది. ఇప్పుడు ఇంకో సర్వే వస్తుంది, దానిలో టిడిపి 90 స్థానాలుకి దిగజారింది అని ఉంటుంది. ఇక ఎన్నికలు అప్పుడు, పవన్-జగన్-మోడీ జోడి అబ్బో చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. ఎన్నికలకి కొన్ని రొజులు ముందు ఇంకొ సర్వే దాని లో టిడిపి కి 60 ఇస్తారు. ఇది చూసి తటస్థ ఓటర్లు, ఈ కూటమి వైపు మొగ్గుతారనేది మోడీ-షా వ్యూహం. అయితే, అన్ని రాష్ట్రాల్లో వర్క్ అవుట్ అయినట్టు, మన రాష్ట్రంలో ఈ స్ట్రాటజీ వర్క్ అవుట్ కాదని, విశ్లేషకులు అంటున్నారు. మన రాష్ట్రంలో మోడీ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నాయి. ఇక్కడ మోడీతో జత కలిస్తే, మట్టి కొట్టుకుపోయే వాతావరణం ఉంది. ఏది ఏమైనా, ప్రజలు ఇలాంటి జిమ్మిక్కలు నమ్మకుండా, వాస్తవం చూడాల్సిన అవసరం, జరుగుతున్నవై అవగాహన పెంచుకుని, అలోచించి నిర్నయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read