చించేస్తాం.. చుక్కలు చూపిస్తాం.. లోపల వేస్తాం... సౌత్ మీద దండయాత్ర మొదలు అని బీజేపీ నేతలు చేస్తున్న అహంకారపు మాటలు, ప్రజల పై ఎలాంటి అభిప్రాయం ఉందో నిన్న ఒక ప్రముఖ జాతీయ సంస్థ చేసిన సర్వేలో బయట పడింది... ఏబీపీ-సీఏడీఎస్-లోక్ నీతి, దేశ వ్యాప్తంగా మోడీ పరిపాలన పై ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో, సౌత్ స్టేట్స్ లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే అయినా, బీజేపీ నేతలు అహంకారం తగ్గించుకుని, కొంచెం వాస్తవంలోకి వస్తారేమో... ఈ సర్వేల సౌత్ స్టేట్స్ లో బీజేపీ దారుణమైన పెర్ఫార్మన్స్ చూపించింది. 5 సౌత్ స్టేట్స్ లో కలిపి, బీజేపీకి కేవలం 18 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జనవరి నెల సర్వేతో పోల్చుకుంటే, దాదాపు 7 శాతం బీజేపీ ఓటు షేర్ తగ్గిందని సర్వే చెప్తుంది. ఆ సర్వే ప్రకారం, సౌత్ స్టేట్స్ లో బీజేపీకి 7 శాతం ఓటు షేర్ తగ్గటానికి కారణం తెలుగుదేశం పార్టీ..

bjp 25052018 2

ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, మోడీ చేస్తున్న మోసం పై దేశ వ్యాప్త ఆందోళన చేసారో, అప్పటి నుంచి బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పింది. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే సరికి, జనవరి నేలతో పోల్చుకుంటే, తెలుగుదేశం పార్టీకి మరింత వోట్ శాతం పెరిగినట్టు చెప్పింది. దీనికి కారణం, మోడీని దేశ స్థాయిలో డీ కొట్టిన పార్టీగా తెలుగుదేశం పార్టీని ప్రజలు గుర్తించటం. అలాగే మిగిలన సౌత్ స్టేట్స్ లో తెరాస, డిఏంకే, జేడీఎస్, లెఫ్ట్ పార్టీ (కేరళ)లో, పుంజుకున్నట్టు సర్వే చెప్పింది.. దేశ వ్యాప్తంగా ఉన్న సర్వే వివరాలు కూడా, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి..ఈ సర్వే ప్రకారం 47శాతం మంది మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అక్కర్లేదని చెప్పారు. మోడీకీ మరోసారి ప్రధానిగా ఛాన్స్ రాకూడని 47శాతం మంది చెప్పారు.

bjp 25052018 3

మొత్తం 15వేల 859 మందిని సర్వే చేయగా.... అందులో కేవలం 39శాతం మంది మాత్రమే మోడీ తిరిగి ప్రధాని కావాలని కోరుకున్నారు. 47 శాతం మంది మోడీకి వ్యతిరేకంగా తమ అభిప్రాయలను వెలిబుచ్చారు. మిగిలిన వారు తటస్థంగా సమాధానం చెప్పారు. ఈ సర్వే ప్రకారం ప్రస్తుతం మోడీకి వ్యతిరేకంగా గాలి వీస్తోంది. ముఖ్యంగా మైనార్టీల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. 75శాతం మంది ముస్లీంలు, అదే సంఖ్యలో క్రిస్టియన్స్, సిక్కుల్లో సగం మంది మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకోవటం లేదు. హిందువుల్లో..... 44శాతం మంది మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు. 42శాతం మంది వ్యతిరేకించారు. బీసీలు కూడా మోడీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని సర్వే తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read