జనాలను ఫేక్ చేసి, పిచ్చోళ్లని చెయ్యటంలో, జగన్ పార్టీతో పోటీ పడుతుంది రాష్ట్ర బీజేపీ.. నిజానికి, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇలా ఫేక్ చెయ్యటం బాగా అలవాటు... అలా ఫేక్ చేసే, అధికారంలోకి కూడా వచ్చింది... అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కూడా ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది... కాని, వీరు కూడా, జగన్ దొరికినట్టు, సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ దొరికిపోతున్నారు... ఈ రోజు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, ఒక అబద్ధపు ప్రచారాన్ని చెప్తూ, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు వెళ్లి మన దేశ ప్రధాని గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం గల నాయకుడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు విదేశాల్లో పర్యటించి దేశ పరువును తీస్తున్నారని విషం చిమ్మారు... పాకిస్థాన్‌కు చంద్రబాబు మోస్ట్‌వాంటెడ్ పర్సన్‌గా మారారని విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లి మోదీని నిందించడమంటే దేశ పౌరులందర్నీ అవమానించడమేనని మండిపడ్డారు.... కాని ఇదంతా అబద్ధం... కింద ఉన్న వీడియో కూడా చూడండి...
రెండు రోజుల క్రిందట సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గున్నారు... ఈ సందర్భంగా, చంద్రబాబు ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానంతో, ఆయన స్టేట్స్మెన్ అనే విషయం మరో సారి రుజువైంది... దక్షిణాది రాష్టాల పట్ల కేంద్రం వివక్ష అవలంబిస్తోందన్నారు. దీనిపై మీ అభిప్రాయం, ఏంటి అని ప్రశ్న అడగగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ, "అది చర్చించడానికి ఇది వేదిక కాదు. ఆ అంశంపై మనం భారత్ లో కూర్చుని మాట్లాడుకుందాం. కానీ నేను ఒక్క విషయం స్పష్టం చేయదలిచాను. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు శిక్షకు గురికాకూడదు. ఇది దేశాభివృద్ధినే ఆటంకపరుస్తుంది." అంటూ సమాధానం చెప్పి ఆపేశారు...
ఇదే విషయం, మేము కూడా ఆర్టికల్ రాసాము... "ధట్ ఈజ్ చంద్రబాబు... మోడీ చేస్తున్న అన్యాయం పై అడిగిన ప్రశ్నకు, ఇది ఆయన సమాధానం..." అంటూ అదే రోజు ఆర్టికల్ కూడా రాసాం... పరాయి దేశంలో, అంతర్జాతీయ వేదికల పై, మన ప్రధాని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో, చంద్రబాబు ఇలా సమాధానం చెప్పి, ఎంతో హుందాగా వ్యవహరించారు... కాని, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, చంద్రబాబు పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు... చంద్రబాబు సింగపూర్ తెలుగుదేశం వాళ్ళతో మాత్రమే రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, ఏమి చెయ్యాలి అనే దాని పై మాట్లాడారు... మిగతా ఆఫీషియల్ ప్రోగ్రామ్ లో ఎక్కడా, ప్రధాని మోడీని కించపరచలేదు... మోడీ లాగా అమెరికా వెళ్లి, అందరి ముందు మన్మోహన్ సింగ్ ను వింర్సించలేదు... ఎంతో హుందాగా వ్యవహరించారు... ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఇప్పటికైనా ఆపి, కేంద్రం నుంచి నాలుగు ప్రాజెక్ట్లు, డబ్బులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే, ప్రజలు కనీసం డిపాజిట్ అన్నా ఇస్తారు...