బీజేపీ పార్టీ ఆడిన విష క్రీడకు, మొదటి బానిస ఎవరు అంటే, ఎవరైనా తమిళనాడు రాష్ట్రమనే చెప్తారు. అందుకే, తమిళనాడు ప్రజలు, మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా తరిమి తరిమి కొడతారు. జయలలితకు ఆరోగ్యం బాగోలేకపోవటం, తరువాత ఆమె మరణం, శశికళకు జైలు, అన్నాడీఎంకేలో ముసలం, ఆ పార్టీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకోవటం, ఇలా అన్ని విషయాల్లో బీజేపీ సక్సెస్ అయ్యింది. తాము సొంతగా తమిళనాడులో ఎదగలేదు అని గ్రహించి, జయలలిత మరణంలో వచ్చిన సంక్షోబం, తమకు అనుకూలంగా తిప్పుకుని, తమిళనాడును ఆడిస్తుంది బీజేపీ... అయితే, ఇప్పుడు మరో పార్టీ డీయంకే చాలా బలంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా, అన్నాడీయంకే, బీజేపీ లొంగిపోవటం చూసి, తమిళనాడు ప్రజలు, డీయంకే వైపు చూస్తున్నారు.
ఈ తరుణంలో, కరుణానిధి చనిపోవటంతో, ఇద్దరు కుమారులు, స్టాలిన్, అళగిరి మధ్య విభేదాలను రాజకీయంగా వాడుకోవటానికి బీజేపీ ప్రయత్నిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. డీయంకే పార్టీ ప్రస్తుతం, స్టాలిన్ చేతిలో ఉంది. అందరూ స్టాలిన్ నే నాయకుడుగా గుర్తిస్తున్నారు. ఈ తరుణంలో కరుణానిధి మరో కొడుకు అళగిరి, ఈ పరిణామాల పై గుర్రుగా ఉన్నారు. స్టాలిన్ ను దెబ్బ తియ్యటానికి, పావులు కదుపుతున్నారు. ఈ తరుణంలో, అళగిరికి బీజేపీ మద్దతు ఇస్తుందనే ప్రచారం, తమిళనాడులో ఉంది. అళగిరి ద్వారా, డీయంకే పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రచారం జరుగుతుంది.
అళగిరి వెనుక భారతీయ జనతా పార్టీ ఉందంటూ వస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పందించారు. అళగిరి వెనుక బీజేపీ లేదా బీజేపీ నేతలు లేరని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డీఎంకేనే కాదే ఏ ఒక్క పార్టీని చీల్చాల్సిన అవసరం బీజేపీకి ఎంతమాత్రం లేదన్నారు. అలాంటి చర్యను తాము ఇష్టపడబోమన్నారు. డీఎంకేలో జరుగుతున్న పరిణామాలకు కూడా రవ్వంత సంబంధం కూడా లేదన్నారు. పైగా భారతీయ జనతా పార్టీ శరవేగంగా వృద్ధి చెందుతోందన్నారు. అలాంటి పార్టీని చూసి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని గుర్తుచేశారు. అదేసమయంలో ఏ క్షణం ఎన్నికలు జరిగినా తాము పోటీ చేసందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.