తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు, సుజనా చౌదరి, ఉప నేత సీఎం రమేశ్, ఇద్దరు సభ్యులు గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ గురువారం బీజేపీలో చేరి, కాషాయం కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా దగ్గర ఈ నలుగురు కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే వీరి చేరిక పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీరి పై ఒత్తిడి తేవటం వల్లే, పార్టీ మారారని ప్రచారం జరుగుతుంది. దీనికి బలం చేకూరుస్తూ, సీబీఐ, ఈడీ చేసిన దాడులు, ఎన్నికల తరువాత కూడా సుజనా పై సిబిఐ దాడులు చెయ్యటం, ఇవన్నీ చూస్తుంటే, వారి దాడి నుంచి తప్పించుకోవడానికే ఈ ఎంపీలతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని రాజకీయాలు తెలిసిన ఎవరైనా ఇట్టే చెప్పచ్చు. ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా అదే. అయితే ఇదే సమయంలో, ఈ నలుగురుకి షాకింగ్ న్యూస్ చెప్పింది బీజేపీ..
రాజ్యసభ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీని వీడి, బీజేపీలో చేరినంత మాత్రాన ఐటీ, ఈడీల నుంచి తప్పించుకోలేరని, ఆ విచారణ అలాగే కొనసాగుతుందని, మురళీధరరావు బాంబు పేల్చారు. టీడీపీ ఎంపీలు, తమ పార్టీలో చేరటం పై స్పందించిన ఆయన, శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసమే నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకున్నామని అన్నారు. ఒక పార్టీలో ఉన్న మెజారిటీ ఎంపీలు, మా పార్టీలో చేరితే అది అనైతికం ఎలా అవుతోందని మురళీధరరావు ప్రశ్నించారు. మరో పక్క స్థానిక నేత అయిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఇదే రకంగా స్పందించారు. సిబిఐ, ఈడీ కేసులు ఉన్న తెలుగుదేశం ఎంపీలు, ఇప్పుడు మా పార్టీలో చేరినా, ఆ విచారణ మాత్రం ఎదుర్కోవలసిందే అని స్పష్టం చేసారు. అయితే ఇవన్నీ మాటల వరుకేనా ? ఇవన్నీ మాట్లాడకుండానే, వారు పార్టీ మారారా ? చూద్దాం కొన్ని రోజుల్లో మనకే వాస్తవాలు కనిపిస్తాయి.