ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఏంటో కాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మైండ్ పోతుంది... ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదని, దానికి సమానమైన డబ్బులు ఇస్తే చాలని, ఈ రోజు ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఒక పక్క రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేస్తుంటే, వెంటనే బీజేపీ, ఆ వ్యాఖ్యలను స్వాగాతించటం, మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.. వీరి ఇద్ది మధ్య ఎంత, బంధం ఉంది అనటానికి ఇదే ఒక ఉదాహరణ... న్యూస్ 18 ఛానెల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, పవన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పెద్ద విషయం కాదని.. పేరు ఏదైనా ఆర్థిక సాయం అందడమే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.
అయితే, ఇదే విషయం, చంద్రబాబు చెప్పినప్పుడు, మాకు ఎంత సమానమైన ప్యాకేజి ఇచ్చినా, మాకు అవసరం లేదని, అవి పాచిపోయిన లడ్డులు అని పవన్ చెప్పిన వ్యాఖ్యలు గుర్తుకువస్తున్నాయి... మరి పవన్, ఇలా ఎందుకు ట్యూన్ మార్చారు ? బీజేపీకి ఇంతలా ఎందుకు లొంగిపోయారో, ఆయనేకే తెలియాలి... అయితే, పవన్ ఇలా ఈ వ్యాఖ్యలు చేసారో లేదో, స్క్రిప్ లో భాగంగా, వెంటనే బీజేపీ రంగంలోకి దిగింది... పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ హరిబాబు స్వాగతించారు. హోదా బదులుగా ఇచ్చిన ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని, పవన్ ప్యాకేజీ గురించి వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషమని హరిబాబు కొనియాడారు.
అయితే, పవన్ వ్యాఖ్యల పై, వెంటనే బీజేపీ స్పందించటం పై, తెలుగుదేశం స్పందించింది... మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, మాట్లాడుతూ, ఏపీకి హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అనాడు కేంద్రం స్పష్టం చేసిందని, అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారని అన్నారు. అయితే హోదా ఉన్నరాష్ట్రాల కాలపరిమితి అయిపోయినా... పొడిగించడంతో ఏపీకి కూడా హోదా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. ఇదే విషయమై జనసేన అధినేత పవన్ చాలా సార్లు మాట్లాడారని, ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలని విమర్శించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆయనతో ఎవరైనా అలా మాట్లాడిస్తున్నారా? లేక పవన్ అభిప్రాయమా? అన్నది ప్రజలు అర్థం చేసుకోవాలని అమర్‌నాథ్ రెడ్డి అన్నారు.