ఒక పక్క జగన్, నేను బీజేపీతో కలుస్తాను అని చెప్పటం... రాష్ట్రంలో కొంత మంది బీజేపీ నేతలు, జగన్ కు వంత పాడటం చూసాం... ఇప్పుడు ఏకంగా బీజేపీ-వైసీపీ కలిపి ప్రెస్‌మీట్ పెట్టటం, సంచలంగా మారింది... బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గున్నారు... ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది... అప్పుడే ఇద్దరూ కలిసిపోయారా అనే అనుమానం కలుగుతుంది... చివరకు వారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి...విష్ణుకుమార్ రాజుకు చంద్రబాబు మిత్రపక్షమో, లేక జగన్ మిత్రపక్షమో మరి...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉన్న వైసీపీ మంత్రులు రాజీనామాలు చేయాలని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ సమావేశంలో ఆయన, పక్కన వైసీపీ ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ఈ వ్యాఖ్యలు చేసారు... సంవత్సరం నుంచి ఈ డిమాండ్ ఎందుకు చెయ్యలేదో ఆయనకే తెలియాలి... ఇన్ని రోజుల నుంచి, వారి పక్కనే అసెంబ్లీలో కూర్చుని, కబుర్లు చెప్పిన విష్ణుకుమార్ రాజుకి ఇప్పుడు మాత్రం గుర్తొచ్చింది... ఎందుకో మరి సడన్ గా, ఈ వ్యవహారం తెర పైకి వచ్చింది... మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో మర్చిపోయారు...
దీని పై, టీడీపీ నేత బొండా ఉమ కూడా స్పందించారు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలు... వాళ్లు చేరికకు ముందే తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించారని అన్నారు. ఇవాళ శాసనసభ వ్యవస్థలో గానీ, పార్లమెంటరీ వ్యవస్థలోగానీ, శాసన మండలి వ్యవస్థలో గానీ.. అక్కడ ఉన్నటువంటి స్పీకర్‌దే తుది నిర్ణయమన్న విషయం తెలుసుకోవాలని ఆయన అన్నారు.... స్పీకర్ నిర్ణయం ప్రకటించక ముందే, వైసీపీ కోర్ట్ కి వెళ్ళిన విషయాన్ని కూడా ప్రస్తావించారు... విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని అన్నారు... రెండు పార్టీలు మిత్రపక్షంగా ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదని ఆయన అన్నారు. ఎందుకంటే రెండు పార్టీలకు రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో అధ్యక్షులు ఉన్నారని, వాళ్ల నిర్ణయం మేరకు అన్నీ జరుగుతాయని బొండా ఉమ వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాలు ఒక్క ఏపీలోనే కాదు... దేశవ్యాప్తంగా ఉన్నాయని ఆయన అన్నారు...