మొన్నటి వరకు చాటు మాటుగా ఉన్న బంధం, బరి తెగించే స్థాయికి వచ్చింది... ఒక పక్క ఆంధ్రులు అందరూ, మోడీ పై ఆందోళన బాట పడితే, మరో పక్క వైసిపీ మాత్రం, మా మోడీ అంటూ, బీజేపీకి ప్రచారం చేస్తుంది... మొన్నటి దాక చాటు మాటుగా ఉన్న బంధం, ఇప్పుడు ఓపెన్ అప్ అయిపొయింది.. ఏమి చేసుకుంటారో చేసుకోండి, మేము బీజేపీకే మద్దతు ఇస్తాం, ప్రజల సెంటిమెంట్ మాకు అనవసరం, మాకు బీజేపీతో ఉంటేనే మా కేసులు మాఫీ అవుతాయి అని బహిరంగంగా చెప్తుంది వైసిపీ... ఏపీలోని ఆ పార్టీకి చెందిన నాయకులు కర్ణాటక వెళ్లి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గాలి జనార్దన్‌రెడ్డికి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు సన్నిహితుడైన రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీ గెలుపు కోసం రోజూ ప్రచారం చే స్తున్నారు.
కర్నూలు, అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు, కర్నూలు జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మొళకాల్మూరులో బి.శ్రీరాములు, బళ్లారి సిటీలో గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి బీజేపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. రామచంద్రారెడ్డి మొళకాల్మూరులో కొన్ని వార్డులకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం నుంచి వైసీపీ కార్యకర్తలను, మునిసిపల్ కౌన్సిలర్లను, తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. సోమశేఖరరెడ్డి తరపునా ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రకు ప్రత్యే క హోదా ఇవ్వనందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేయాలని ఏపీ నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతుంటే.. వైసీపీ నాయకులు కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేస్తు న్నారు.
ఇప్పటికే జగన్ పెద్ద ఎత్తున తన మనుషులని కర్ణాటక పంపించారు.. కడప, అనంతపురం నుంచి, ఇప్పటికే కొన్ని వేల మంది వైసిపీ కార్యకర్తలని, కర్ణాటక పంపించారు.. అక్కడ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గునటం, చీకటి పడిన తరువాత, ఎన్నికల సమయంలో చేసే పనులు, వీళ్ళ బాధ్యత... అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి వ్యతిరేక ప్రచారం చేసే ఎవరైనా వస్తే, వారిని అడ్డుకోవటం కూడా వీరి బాధ్యత... మొన్న మహా న్యూస్, బెంగుళూరులో డిబేట్ జరుపుతుంటే, అక్కడకు వెళ్లి, గొడవ చేసి, మహా న్యూస్ మూర్తి పై దాడి చేసింది కూడా ఈ వైసిపీ కార్యకర్తలే... నిన్న అశోక్ బాబు పై కూడా దాడి చేసారు. మొత్తానికి, అమిత్ షా ని ప్రసన్నం చేసుకోవటాని, జగన్, విజయసాయి రెడ్డి, కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు... మరి, ఫలితం ఎలా ఉంటుందో, కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది...